రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు, బాలీవుడ్, కోలీవుడ్, శాండిల్ వుడ్ సినిమాలలో నటిస్తూ అందరిని ఆకట్టుకుంటుంది. తెలుగులో మన్మధుడు సరసన ఛాన్స్ కొట్టేసింది. మరోవైపు బాలీవుడ్ లో అజయ్ దేవగణ్ కు జోడిగా నటించిన ‘దే దే ప్యార్ దే’ విడుదలకు సిద్దమవుతుంది. ఈ చిత్రం లో సీనియర్ నటి టబు కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఈ మధ్యే విడుదల కాబడిన ఈ చిత్ర ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన లభించింది. సినిమా విడుదల సమయం దగ్గరపడుతున్న కొద్దీ చిత్ర ప్రమోషన్స్ పెంచేస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుండి ‘వడ్డీ షరాబన్’ పాటను రిలీజ్ చేశారు చిత్ర బృందం వారు.
రకుల్ ఈ పాటలో చీర చుట్టేసుకొని తన అందాలను ఆరబోస్తూ, చిందేసింది. ఎంతో హుషారుగా పెళ్ళిలో అజయదేవగన్ తో స్టెప్స్ వేసిన ఈ పాటకు కొన్ని గంటల సమయంలోనే యూట్యూబ్ లో పద్నాలుగు లక్షల మంది కంటే ఎక్కువగా వీక్షించారు. సోషల్ మీడియా లో చెక్కర్లు కొడుతున్న ఈ పాట యూట్యూబ్ ని షేక్ చేసేస్తోంది.
ఈ పరంగా రకుల్ తన ఆనందాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. ‘వడ్డీ షరాబన్’ సాంగ్ షూటింగ్ జరుగుతున్నపుడు ఎంతో సరదాగా చేశాము. ఇలాంటి మంచి పాటను నాకు ఇచ్చినందుకు అందరికి నా కృతజ్ఞతలు అంటూ తెలియపరిచింది. అంతే కాకుండా ఆధరిస్తున్నా అబిమానులందరికి ధన్యవాదాలు అంటూ తెలిపారు. ఈసినిమాను మే 17వ తేదీన విడుదల చేయుటకు దర్శకులు అకీవ్ అలీ సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.