Home టాప్ స్టోరీస్ ప్లానింగ్ తో కొడుతున్న డార్లింగ్: టాలీవుడ్ షాక్

ప్లానింగ్ తో కొడుతున్న డార్లింగ్: టాలీవుడ్ షాక్

861211 prabhas 082219

బాహుబలి సినిమాతో ప్రభాస్ పేరు జాతీయస్థాయిలో వినిపించ సాగింది. ఆ తర్వాత విడుదలైన బాహుబలి2 కూడా భారీ విజయాన్ని అందుకోవడంతో ప్రభాస్ ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయాడు. దీంతో ప్రభాస్ క్రేజ్ భారీగా పెరిగింది. ఈ క్రేజ్ ను ప్రభాస్ సరిగ్గా హ్యాండిల్ చేయలేడని చాలా మంది హీరోలు అనుకున్నారు. మొదట్లో సుజిత్ లాంటి ఒక చిన్న స్థాయి డైరెక్టర్ కు అవకాశం ఇవ్వడం ఏంటని పలువురు ప్రభాస్ ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. బాహుబలి వంటి సూపర్ సక్సెస్ తర్వాత ఇటువంటి దర్శకుల కంటే పెద్ద దర్శకులు ఛాన్స్ ఇవ్వడం మంచిదని వారు అభిప్రాయపడ్డారు. అయితే వాళ్ళ అనుమానాలను పటాపంచలు చేస్తూ ప్రభాస్ విజువల్ వండర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ మంచి విజయం సాధించింది.

తాజాగా ప్రభాస్ మహానటితో నేషనల్ అవార్డు గెలిచిన నాగ్ అశ్విన్ తో కలిసి వరల్డ్ వార్ త్రీ నేపథ్యంలో ఓ సినిమాలో చేస్తున్నాడు. ఈ సినిమా దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కనుందని తెలుస్తోంది.ఈ సినిమా హిందీ – తెలుగు తో పాటు అన్ని ప్రాంతీయ భాషల్లో విడుదల కానుంది. తాజాగా ప్రభాస్ మరో సినిమాను కూడా ప్రకటించాడు. బాలీవుడ్ డైరెక్టర్ దర్శకత్వం “ఆదిపురుష్” సినిమా చేయనున్నాడు. పురాణ ఇతిహాసాలు నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా నటించనున్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాను టి సిరీస్ నిర్మిస్తోంది. 

ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్న మూడు సినిమాలు పాన్ ఇండియా చిత్రాలు. ఇవి ప్రధానంగా తెలుగు-హిందీలో విడుదల కానున్నాయి. అంటే ప్రభాస్ బాలీవుడ్ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకునే ఈ సినిమాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో ఏ ఒక్క సినిమా హిట్టయినా ప్రభాస్ రేంజ్ తారాస్థాయికి చేరుతుంది. అంతేకాకుండా పాన్ ఇండియా సినిమాలను  ప్రపంచవ్యాప్తంగా చూసే అవకాశం ఎక్కువ. దీంతో ప్రభాస్ మార్కెట్ ఇతర దేశాల్లో కూడా పెరగనుంది. టాలీవుడ్ హీరోలు ఒకటి రెండు సినిమాలు చేయడానికి నానా కష్టాలు పడుతున్న సందర్భంలో ప్రభాస్ మూడు సినిమాలతో అన్ని భాషలు చుట్టేసుకున్నాడు. ఈ ఒక్క ఉదాహరణ చాలు బాహుబలి ద్వారా వచ్చిన క్రేజ్ ని ప్రభాస్ ఏ స్థాయిలో వినియోగిస్తాడు అని చెప్పడానికి. ప్రభాస్ వరుస సినిమాలను చూసి మొదటి విమర్శించిన వారే ఇప్పుడు ముక్కున వేలేసుకుంటున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad