Home టాప్ స్టోరీస్ ఆరంభం అద్భుతం...చివర్లో చిందరవందర

ఆరంభం అద్భుతం…చివర్లో చిందరవందర

tollywood film industry 1200x1107 1

పరిస్థితులు ఏప్పుడు మన చేతుల్లో ఉండవు ..హఠాత్తుగా జరిగే యాదృచ్ఛిక పరిణామాలు, ప్రకృతి ప్రళయాలకు ఎవరు అతిథులు కాదు. ఎమర్జెన్సీ, తెలంగాణ బంద్ తరువాత అ స్థాయిలో భారీ నష్టాలను చేకూర్చిన ఏకైక సంవత్సరం 2020 మాత్రమే. ఈ ఏడాది ప్రారంభంలో మహేష్ బాబు నటించిన “సరిలేరు నీకెవ్వరు”…అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురము ఇలాంటి చిత్రాలు భారీ విజయాన్ని అందుకోవడంతో ఇండస్ట్రీ ద్వితీయార్థం అద్భుతంగా కొనసాగుతుందని సినీ పెద్దలు అనుకున్నారు. అయితే ఒక్కసారి కరోనా దేశాన్ని కమ్మేయడంతో పరిస్థితులు తలకిందులు అయిపోయాయి. ప్రారంభంలో ఉన్నంత జోరు ఇప్పుడు లేదు.

వాస్తవానికి అసలు సినిమాలే లేవు. సినిమాలు లేకుంటే థియేటర్లు, సినీ కార్మికులు వాటి మీద ఆధారపడి పనిచేసే ఇతను వర్కర్లకు జీవితమే లేదు. తాజాగా కేంద్రం సినిమా షూటింగ్ లకు అనుమతి ఇచ్చినప్పటికీ ఈ పరిస్థితుల్లో మాత్రం ఎటువంటి మార్పు లేదు. వ్యాక్సిన్ వచ్చేంత వరకు తాము చిత్రీకరణలో పాల్గొనమని ఇప్పటికే బడా హీరోలు తేల్చిచెప్పారు. మరోవైపు కరోనాకి భయపడి కార్మికులు కూడా షూటింగులకు దూరంగా ఉంటున్నారు. ఇక థియేటర్లు ఇప్పట్లో తెరిచే అవకాశం లేదు. ఒక వేళ తెరిచినా థియేటర్ కు ప్రేక్షకులు వస్తారన్నది అంతులేని ప్రశ్నగా మిగిలిపోయింది. ప్రొడ్యూసర్లు తన సినిమాలను అటు థియేటర్ లో విడుదల చేయలేక మరోవైపు ఓటీటీ వేదికలకు అందించలేక నానా కష్టాలు పడుతున్నారు.

తాజాగా నిశ్శబ్దం సినిమా విషయంలో ఇటువంటి పరిస్థితి నెలకొంది. భారీ అంచనాలు అద్భుతమైన టెక్నికల్ వాల్యూస్ తో నిర్మించిన ఈ సినిమాకి కోన వెంకట్ థియేటర్లలో విడుదల చేయడానికి తీవ్రంగా ప్రయత్నించాడు. అయితే పరిస్థితులు అనుకూలించకపోవడంతో నష్టాలను పూడ్చుకోవడానికి ఓటీటీకి జై కొడుతున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ ఈ ఏడాది సినీ ఇండస్ట్రీకి పీడకలగా మిగిలిపోయింది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad