Home టాప్ స్టోరీస్ సునీల్ నీ దారి ఏటు?

సునీల్ నీ దారి ఏటు?

Sunil 1596775247

ఇండస్ట్రీలో ఎంతమంది హాస్యనటులు ఉన్నా సునీల్ కామెడీకి ప్రత్యేకమైన స్థానం ఉంది. 2010 వరకు టాలీవుడ్ టాప్ కమెడియన్ గా సునీల్ కొనసాగుతూ వచ్చారు. ఆ తర్వాత మనసు మార్చుకుని హీరో పాత్రలపై దృష్టి సారించారు. ఈ సమయంలో వచ్చిన అందాల రాముడు, ‘మర్యాద రామన్న’ సినిమాలు మంచి విజయం సాధించడంతో హీరోగా నిలదొక్కుకున్నాడు. తర్వాత పరిస్థితులు మారుతూ వచ్చాయి. హీరోగా మంచి పేరు తెచ్చుకున్నప్పటికీ ఆ స్థాయిని కొనసాగించ లేకపోయాడు. ఒకానొక దశలో సిక్స్ ప్యాక్ చేసి అనారోగ్యం పాలయ్యారు కూడా. దీని వలన ముఖం మరియు శరీరంలో అనేక మార్పులు జరిగి హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా నిలబడలేకపోయారు.

పరిస్థితి ఏ స్థాయి వరకు చేరిందంటే మరల కమెడియన్ గా టర్న్ అయ్యి రీఎంట్రీ ఇద్దమనుకున్నప్పటికి ఎవరు ముందుకు రాలేదు. దీంతో విలన్ గా మారి సిల్వర్ స్క్రీన్ షేక్ చేద్దాం అనుకున్నాడు. డిస్కో రాజా సినిమాతో విలన్ గా ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈ సినిమా ద్వారా పరాభవం చెందడంతో సునీల్ డీలా పడ్డాడు. మళ్లీ ఇన్నాళ్లకు ‘కలర్ ఫొటో’ సినిమా ద్వారా విలన్ గా మరోసారి తన లక్ ను ప్రయత్నిద్దాం అనుకుంటుండగా కథ ఒక్కసారి అడ్డం తిరిగింది. మొదట ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేద్దాం అనుకున్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మూవీ టీం సినిమాను తెలుగు ఓటీటీ ఆహాలో విడుదల చేయడానికి సర్వం సిద్ధం చేసింది.

వాస్తవానికి సినిమాలు థియేటర్ లో విడుదల అయితేనే నటీనటులకు మంచి గుర్తింపు వస్తుంది. ప్రేక్షకులు కూడా వారిని గుర్తిస్తారు. కానీ ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో విడుదల అవుతుండటంతో సునీల్ డైలమాలో పడినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ద్వారా అయినా బౌన్స్ బ్యాక్ అవుదాం అనుకున్నప్పటికీ ఆ అవకాశం కూడా చేజారిపోయిందని సునీల్ బాధపడుతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ సినిమాలో కమెడియన్ సుహాస్ కథానాయకుడిగా నటిస్తున్నారు. విజేత, పేపర్‌ బాయ్‌, మజిలీ, డియర్‌ కామ్రేడ్‌, ప్రతిరోజూ పండగే సినిమాల్లో తనదైన నటనతో ఆకట్టుకున్న సుహాస్‌ ఈ సినిమాతో హీరోగా పరిచయం కాబోతున్నారు. నటుడు సందీప్ రాజ్ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. 

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad