Home సినిమా కమెడియన్ పృథ్వీరాజ్‌కు తీవ్ర అస్వస్థత.. కరోనా పాజిటివ్‌తో క్వారంటైన్‌కు తరలింపు

కమెడియన్ పృథ్వీరాజ్‌కు తీవ్ర అస్వస్థత.. కరోనా పాజిటివ్‌తో క్వారంటైన్‌కు తరలింపు

prudhviraj 1200x900 1

ప్రముఖ తెలుగు కమెడియన్ పృథ్వీ రాజ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనకు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. గతకొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఆయనకు ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆసుపత్రిలో చేర్పించారు. కాగా ఆయనకు అన్ని టెస్టులు చేయగా కరోనా పాజిటివ్ అని తేలింది. ఆయన ఆరోగ్యానికి సంబంధించి అందరూ ఆరా తీస్తున్నారు.

దీంతో ఆయన తన ఆరోగ్యం గురించి ఓ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గత పది రోజుల నుంచి తీవ్ర అనారోగ్యంతో సతమతమవుతున్న తాను అన్ని రకాల టెస్టులు, సీటీ స్కాన్ చేయించుకున్నట్లు తెలిపారు. ఒకసారి కరోనా నెగెటివ్ అని రాగా, మరోసారి కరోనా పాజిటివ్ అని రిపోర్ట్ వచ్చినట్లు ఆయన తెలిపారు. వైద్యుల సూచనల మేరకు కొన్ని రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంటున్నట్లు ఆయన తెలిపాడు.

పృథ్వీ రాజ్‌కు కరోనా పాజిటివ్ రావడంతో ఇండస్ట్రీ వర్గాలు ఉలిక్కి పడ్డాయి. ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే పృథ్వీ రాజ్ ఇలా ఆసుపత్రి బెడ్‌పై పడి ఉండటం నిజంగా బాధాకరంగా ఉందని పలువురు కామెంట్ చేస్తున్నారు. ఇక ఆయన త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు కోరుతున్నారు. అయితే పృథ్వీ రాజ్ శ్వాస సంబంధిత సమస్యతో కూడా బాధపడుతుండటంతో ఆయన ఆరోగ్యం బాగా క్షీణించినట్లు తెలుస్తోంది. అటు పృథ్వీ రాజ్ గతకొద్ది రోజులుగా రాజకీయాలకు కూడా దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad