త్యాగరాజన్ కుమారరాజా దర్శకత్వంలో విడుదలైన సినిమా ‘సూపర్ డీలక్స్’. ఈ సినిమాలో సమంత , రమ్యకృష్ణ , విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించారు. గత వారం విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులనుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. కానీ తమిళ సినిమాటోగ్రాఫర్ నటరాజన్ సుబ్రహ్మణ్యం మాత్రం సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ఇప్పుడు ఎలాంటి వాటినైనా తెలిపేందుకు సామాన్యులనుంచి.. సెలబ్రెటీల వరకు ట్విట్టర్ ను వేదికగా చేసుకొని స్పందిస్తున్నారు. విజయ్ సేతుపతి హిజ్రా పాత్రలో, రమ్యకృష్ణ వేశ్య పాత్రలో, ఓ ప్రధాన పాత్రలో సమంతా నటించారు. దీనికి గాను సుబ్రహ్మణ్యం ట్విట్టర్లో ‘నిజ జీవితంలో ఇలాంటి అసహ్యమైన అంశాలను ప్రోత్సహించడం, అభినందించడం కరెక్టేనా? ఇలాంటి తక్కువ స్థాయి అంశాలకు నేను దూరంగా ఉంటాను. ‘సూపర్ డీలక్స్’.. ఇది సినిమానా..ఓ గాడ్.. అసలు భరించలేకపోయా’ అంటూ విమర్శిస్తూ పోస్ట్ చేశారు.
ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. సినిమా నచ్చకపోతే తనకు నచ్చినట్టు కామెంట్ చేయడం సరైన విధానము కాదంటూ అభిమానులు ఆగ్రహానికి గురవుతున్నారు. నీచమైన కామెంట్ చేయడం సబబు కాదని బుద్ధిచెబుతున్నారు. శృంగారం, లింగ వివక్షత లతో కూడిన సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయి.