Home సినిమా 'చిత్రలహరి ' మూవీ రివ్యూ..!

‘చిత్రలహరి ‘ మూవీ రివ్యూ..!

నటీనటులు : సాయిధ‌ర‌మ్ తేజ్, క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శన్‌, నివేదా పేతురాజ్, సునీల్,వెన్నెల కిషోర్
మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యానర్ పై కిషోర్ తిరుమ‌ల ద‌ర్శక‌త్వం వహిస్తున్న సినిమా ‘చిత్రలహరి’. ఈ సినిమాలో సాయిధ‌రమ్ తేజ్ , క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శన్‌, నివేతా పుతురాజ్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రము న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, చెరుకూరి మోహ‌న్ నిర్మాణంలో రూపొందించారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. వరుసగా ఆరు ప్లాప్ లతో ‘చిత్రలహరి’ విజయాన్ని అందించాలని నా పేరు విజయ్ అంటూ రంగంలోకి ఈరోజు దూకాడు. మరి ఎంత వరకు సక్సెస్ సాధించాడు.. ప్రేక్షకుల మదిని మెప్పించాడో.. చూద్దాం రండి.

కథ‌లోకి వెళ్తే ..

సాయి ధరమ్ విజయ్‌ కృష్ణ పాత్రలో, క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శన్‌ లహరి పాత్రలో, నివేదా పేతురాజ్ చిత్ర పాత్రలో నటించారు. విజయ్‌ కృష్ణ జీవితంలో సక్సెస్‌ కోసం వెంపర్లాడుతుంటాడు. ఎంత ప్రయత్నించినా విజయం తనని వరించట్లేదని ఎంతో నిరుత్సాహ పడుతుంటాడు. ఈ పోటీ ప్రపంచంలో అతను ఎప్పటికీ గెలవలేనని , తన పేరులో ఉన్న విజయం .. జీవితంలో ఎప్పటికి రాదని భాద పడుతుంటాడు. కానీ విజయ్ తండ్రి (పోసాని కృష్ణమురళి) కొడుకు మీద నమ్మకంతో ఎప్పటికైనా సక్సెస్‌ సాధిస్తాడని గట్టి నమ్మకాన్ని ఏర్పర్చుకుంటాడు. ఈ సినిమాలో ఒక కొత్త పాయింట్ తీసుకొచ్చాడు. యాక్సిడెంట్‌ జరిగి టైం కి సరైన సహాయం అందకుండా చనిపోయే వారిని దృష్టిలో పెట్టుకొని , యాక్సిడెంట్‌ గురైన వారిని కాపాడుటకు ఓ డివైజ్‌ను తయారు చేస్తాడు. దాని స్పాన్సర్‌షిప్‌ కోసం వెతుకుతున్న సమయాన లహరి పరిచయమవుతుంది. ఇక హీరో ఎన్నో అబద్దాలతో ఆమెకు దగ్గరవుతాడు. లహరిని ప్రేమిస్తాడు. కానీ ఈ నిజం ఆమెకు తెలిసి దూరంగా వెళ్తుంది. ఇక ప్రేమలో సక్సెస్‌ దక్కలేదని కుంగిపోతాడు. విజయ్ జీవితంలో సక్సె సాధిస్తాడా ? తిరిగి లహరి అతని జీవితం లోకి వస్తుందా? నివేదా పేతురాజ్‌ పాత్ర ఏంటి? యూత్ లైఫ్ లో జరుగుతున్న ప్రెసెంట్ కథను తీసుకొని తెరకెక్కించిన మిగితా స్టోరీ ని తెరమీదే చూడాలి.

ఫస్టాఫ్ ఎమోషన్స్, కామెడీ, డైలాగ్ లతో సాయి సూపర్ అనిపించుకున్నాడు. కానీ సెకండ్ హాఫ్‌ను దర్శకులు సాగదీశారని అభిప్రాయాన్ని వెల్లడించారు. సెకండాఫ్ లో సినిమా మొత్తం స్టోరీ మారిపోయిందని.. అది కూడా బాగుంటే సినిమాకు ప్లస్ పాయింట్ అయ్యేదని ప్రేక్షకులు తెలిపారు. యావరేజ్ సినిమాగా టాక్ వచ్చింది.

నటనా పరంగా :

సాయి మిగితా సినిమాలతతో పోలిస్తే ఈ సినిమాలో న్యూ లుక్ లో కనిపించారు. క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శన్‌ అందముతో, నివేతా పుతురాజ్ అభినయముతో ఆకట్టుకున్నారు. పోసాని మురళి కృష్ణ నటన అద్భుతమని చెప్పవచ్చు. సునీల్, వెన్నెల కిశోర్ కడుపుబ్బా నవ్వించారు.

బలం:

సాయి నటన
పోసాని మురళి కృష్ణ నటన
దేవిశ్రీ ప్రదేశ్ సంగీతం
బాక్గ్రౌండ్ స్కోర్

బలహీనతలు:

కథ ను సాగదీశారు.
క్యారెక్టరైజేషన్స్‌

దర్శకత్వం: కిషోర్ తిరుమల
నిర్మాత : న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, చెరుకూరి మోహ‌న్
బ్యానర్ : మైత్రీ మూవీ మేక‌ర్స్
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్

 Rating : 2.5/5.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad