కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న సినిమా చిత్రలహరి. సాయిధరమ్ తేజ్ హీరో గా కళ్యాణి ప్రియదర్శన్, నివేతా పుతురాజ్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు. అందమైన లవ్ ఎంటెర్టైన్మెంటగా సాగే చిత్రాన్ని ఏప్రిల్ 12వ తేదీన రిలీజ్ చేస్తున్నారు. సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ వారు ప్రమోషన్ వేగం పెంచేస్తున్నారు. ఈ పరంగా ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ యూత్ ని ఎంత గానో ఆకట్టుకున్నాయి. తాజాగా చిత్రం నుంచి మూడవ లిరికల్ పాటను విడుదల చేశారు.
‘రంగురంగు పువ్వులున్న అందమైన తోటలో ఇప్పుడే పూసిన కొత్త పువ్వులా.. ఏడురంగులొక్కటై పరవశించు వేళలో నేలకే జారిన కొత్త రంగులా… ప్రేమ వెన్నెలా.. రావే ఊర్మిళా.. ‘ అంటూ ఈ పాట కొనసాగుతుంది. ప్రకృతి వరంగా భావిస్తూ అమ్మాయిని తదైనా శైలి లో వర్ణిస్తూ.. హీరో మనసులోని మాటలకు అక్షర రూపం దాలిస్తే ప్రకృతి తోడైనట్లు ఎంతో సులభంగా పాడుకునే పాట ఇది. సాయి ధరమ్ తేజ్ కల్యాణి ప్రియదర్శని ల పై చిత్రీకరించిన సాంగ్ యూత్ కి నచ్చేలా ఉంది. సుదర్శన్ అశోక్ ఆలపించిన పాట కు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని, శ్రీమణి సాహిత్యాన్ని అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, చెరుకూరి మోహన్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Read also :