కొణిదెల ప్రొడక్షన్స్ పై సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా సైరా. రామ్ చరణ్ నిర్మాణము వహిస్తున్న ఈ సినిమాలో, చిరంజీవి ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. మొట్టమొదటి స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. బ్రిటిష్ సైనికులతో ఎంతో వీరపోరాటము చేసిన వ్యక్తి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి.
అతని జీవిత చరిత్రను మెగాస్టార్ చిరంజీవి యొక్క 151 వ సినిమాగా ‘సైరా నరసింహారెడ్డి’ గా సంగతి అందరికి తెలిసిందే. ఈ సమారోయోధుడి పాత్రలో మెగాస్టార్ నటిస్తుండగా.. సినిమాలో బిగ్ బి, రమ్యకృష్ణ తదితర నటీనటులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.
మెగా స్టార్ ఎండాకాలం అనుకున్నాడేమో.. ఇంతటి మండుటెండలో షూటింగ్ ఏం చేస్తాంలే అనుకోని అలా భార్యతో కలిసి చల్ల చల్ల గా సేద తీరుతున్నాడు జపాన్ లో. మెగా స్టార్ వేసిన ట్రిప్ తో సైరా చిత్ర షూటింగ్ కి బ్రేక్ లు పడ్డాయి. బ్రేక్ లు పడ్డా పర్వాలేదు మంచి ఎనెర్జీతో వచ్చి చేయగలడని నమ్మకముతో ఉన్నారట చిరు ఫ్యామిలీ.
ఈ పరంగా చిరు, భార్య సురేఖ తో కలిసి ఎంత ఆనందంగా ఉన్నారో అక్కడి పోటోలను అభిమానులతో పంచుకుంది మెగా డాటర్ సుస్మిత కొణిదెల . మెగా డాటర్ ట్విట్టర్ లో ‘మా అమ్మ నాన్న బిజీ షెడ్యూల్ కి బ్రేక్ ఇచ్చారు. జపాన్ సాకురా బ్లూస్మ్స్, మౌంట్ఫుజి లో చాలా ఆనందంగా గడుపుతున్నారు. వాళ్లకు రెస్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్’ అంటూ చిరంజీవి, భార్య సురేఖ తో ఉన్న పోటోలను షేర్ చేసింది.