
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్‌ను రఫ్ఫాడించేందుకు చిరు రెడీ అవుతున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే సగం పూర్తియ్యిందని, త్వరలోనే మిగతా షూటింగ్‌ను తిరిగి ప్రారంభించి పూర్తి చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. కాగా ఈ క్రమంలో చిరు తన నెక్ట్స్ మూవీకి సంబంధించిన అనౌన్స్మెంట్ చేస్తాడని అందరూ ఎదురుచూస్తున్నారు.
ఇటీవల చిరు బర్త్‌డే సందర్భంగా ఈ అనౌన్స్మెంట్ ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ ఆ రోజు ఎలాంటి అనౌన్స్మెంట్ లేకపోవడంతో అందరూ నిరాశకు లోనయ్యారు. కాగా ఇప్పటికే చిరు కోసం ముగ్గురు డైరెక్టర్లు కథలను రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. వివి వినాయక్, బాబీ, మెహర్ రమేష్‌లు చిరు కోసం కథలను రెడీ చేస్తోండగా, వారిలో కేవలం బాబీ మాత్రమే స్ట్రెయిట్ కథను రాస్తున్నాడట. వినాయక్, మెహర్ రమేష్‌లు రీమేక్ కథలను చిరు ఇమేజ్‌కు తగ్గట్టుగా తీర్చిదిద్దుతున్నారు.
అయితే చిరు మాత్రం ఈ ముగ్గురిలో ఎవరితో సినిమా చేస్తాడా అనే విషయంపై ఇంకా సైలెంట్‌గా ఉన్నారు. మరి చిరు ఈ విషయంపై ఎందుకు క్లారిటీ ఇవ్వలేదా అని మెగా ఫ్యాన్స్ ఆలోచిస్తున్నారు. ఏదేమైనా చిరు సస్పెన్స్‌తో వారు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా చిరు తన నెక్ట్స్ మూవీని ఎవరితో చేస్తున్నాడా అనే విషయంపై క్లారిటీ ఇస్తే బాగుంటుందని చిత్ర వర్గాలు అంటున్నాయి. ఇక ఆచార్య చిత్రంలో చిరంజీవి సరసన అందాల భామ కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోండగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ కేమియో పాత్రలో నటిస్తున్నాడు.