Home టాప్ స్టోరీస్ చిరంజీవి మనుమరాలు అప్పుడే ఇంతపెద్దగా అయ్యిందా?

చిరంజీవి మనుమరాలు అప్పుడే ఇంతపెద్దగా అయ్యిందా?

Chiranjeevi Kissing Grand Daughter Nivrutha

మెగాస్టార్ చిరంజీవి సినిమాలకు ఎంత టైమ్ కేటాయిస్తారో అందరికీ తెలిసిందే. అయితే ఆయన ఫ్యామిలీకి కూడా అంతే ప్రాముఖ్యతను ఇస్తూ, వీలు చిక్కినప్పుడల్లా తన కుంటుంబంతో గడిపేస్తుంటారు. తన కొడుకు, కూతుళ్లు, వాళ్ల పిల్లలతో చిరు చాలా సరదాగా సమయం గడుపుతుంటారు. ఇటీవల తన మనుమరాలైన శ్రీజా-కళ్యాణ్‌దేవల కుమార్తె నవిష్యతో చిరు సరదాగా గడిపిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కాగా తాజాగా తన గారాల మనుమరాలు నివృతతో చిరు దిగిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమెను ప్రేమగా దగ్గరకు తీసుకుని ఆమె నుదుటిపై ముద్దుపెడుతూ చిరు ఆమెపై చూపిస్తు్న్న ప్రేమను ఈ ఫోటోలో మనకు కనిపిస్తుంది. ఇక ఈ ఫోటోను నివృత తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోను చూసిన మెగా ఫ్యాన్స్ సంతోషంతో పాటు ఆశ్చర్యానికి గురవుతున్నారు. శ్రీజా-కళ్యాణ్ దేవ్‌ల పెళ్లి సమయంలో చాలా చిన్నగా ఉన్న అమ్మాయి, అప్పుడే ఇంత పెద్దగా అయ్యిందా అంటూ వారు నోరెళ్లబెడుతున్నారు.

Chiranjeevi Kissing Grand Daughter

ఏదేమైనా చిరు తన మనుమరాలిపై చూపిస్తున్న ప్రేమకు మెగా ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇటీవల 65వ పుట్టినరోజు జరుపుకున్న మెగాస్టార్‌కు తన కుటుంబ సభ్యులు ఆప్యాయంగా శుభాకాంక్షలు తెలిపారు. ఇక సినిమాల పరంగా మెగాస్టార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ ఫస్ట్ లుక్‌ను ఆయ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేశారు. ఈ సినిమాను దర్శకుడు కొరటాల శివ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad