Home సినిమా టాలీవుడ్ న్యూస్ చేపల ఫ్రై చేస్తున్న చిరు.. అమ్మ కోసమే!

చేపల ఫ్రై చేస్తున్న చిరు.. అమ్మ కోసమే!

Chiranjeevi Doing Fish Fry For His Mother

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య ఇప్పటికే 40 శాతం షూటింగ్ జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ సరికొత్తగా కనిపిస్తాడని చిత్ర యూనిట్ మొదట్నుండీ చెబుతూ వస్తోంది. కాగా పూర్తి కమర్షియల్ అంశాలతో ఈ సినిమా తెరకెక్కుతుండటంతో ఈ సినిమా ఎలా ఉంటుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

కాగా ప్రస్తుతం నెలకొన్న లాక్‌డౌన్ కారణంగా ఆయన ఇంటికే పరిమితం అయ్యాడు. అడపాదడపా వీడియోలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న మెగాస్టార్, తాజాగా మరో వీడియోతో మనముందుకు వచ్చాడు. ఆయన తన తల్లికి చేపల వేపుడు చేస్తూ కనిపించాడు. చిరుకు చేపల వేపుడు అంటే మహా ఇష్టమట. అందుకే తన తల్లి నేర్పిన వంటను తల్లి కోసం చేస్తున్నానంటూ చిరు ఈ రకంగా ఓ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

ఈ వీడియోలో చిరు చాలా ఎక్స్‌పర్ట్‌గా చేపల వేపుడు చేసి, తన తల్లికి రుచి చూసి చెప్పాల్సిందిగా వడ్డించాడు. దీనికి ఆమె చాలా బాగుంది అనే బదులివ్వడంతో చిరు మొహంలో పూర్తి సంతోషాన్ని మనం చూడగలం. ఇక ఈ వీడియోను చిరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, ప్రస్తుతం ఇది బాగా వైరల్‌గా మారింది. ఏదేమైనా చిరు ఇలా లాక్‌డౌన్ సమయాన్ని ఏదో ఓ పని చేస్తూ గడిపేస్తుండటంతో ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad