Home సినిమా చిరు డబల్ డోస్ : స్క్రీన్ దద్దరిల్లిపోద్ది

చిరు డబల్ డోస్ : స్క్రీన్ దద్దరిల్లిపోద్ది

chiru-sai-dharam-tej

90వ దశకంలో ఎన్టీఆర్ మరియు నాగేశ్వరావు కలయికలో ఎన్నో అద్భుతమైన మల్టీస్టారర్ సినిమాలు తెరకెక్కాయి.అయితే తర్వాత తరం హీరోలు ఎవరు మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి ముందుకు రాలేదు. మహేష్ బాబు – వెంకటేష్ పాత వైభవాన్ని గుర్తుకు తెస్తూ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే సినిమా చేశారు. ఈ సినిమా మంచి విజయం సాధించి నిర్మాత దిల్ రాజుకు లాభాలను తీసుకువచ్చింది. ఇప్పట్లో ఒకే కథానాయకుడు ఉన్న సినిమాల కంటే మల్టీస్టారర్ కే ఎక్కువ ఆధారణ ఉంది. ఇప్పుడు ఈ ట్రెండ్ ను చిరు బ్రేక్ చేయనున్నారని తెలుస్తుంది. కెరీర్ మొదట్లో మల్టీస్టారర్ సినిమాలు చేసిన చిరు మళ్లీ ఇన్నాళ్లకు ఆ జోనర్ ను ఎన్నుకున్నట్లు తెలుస్తుంది. మెగాస్టార్ చిరంజీవి కెఎస్ రవీంద్ర అలియాస్ బాబీ కలయికలో ఓ సినిమా రానుందనిజోరుగా ప్రచారం జరుగుతుంది.

దీనిని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్నారు. ఈ సినిమాలో చిరుతో పాటు సుప్రీమ్ స్టార్ సాయి ధరం తేజ్ కలిసి నటించనున్నారు. ఈ సినిమా లూసిఫర్ రీమేక్ కాదని సరికొత్త కథ అని తెలుస్తోంది. చిరు సాహో ఫేమ్ సుజీత్ కలయికలో లూసిఫర్ రీమేక్ వస్తుంది అనుకున్నప్పటికీ చిరు రీమేక్ పై పూర్తి కాన్ఫిడెంట్ గా లేకపోవడంతో బాబీని రంగంలోకి దించినట్టు ఫిల్మ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మెగాస్టార్ కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ మధ్యలోనే నిల్చిపోయింది. అయినప్పటికీ అనుకున్న సమయానికే సినిమా విడుదల అవుతుందని మూవీ ప్రకటించింది. బాబీ కధ చిరుకి నచ్చినట్టు అయితే వచ్చే ఏడాది ఈ సినిమా పట్టాలెక్కి అవకాశం ఉంది .

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad