
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ ఇప్పటికే షూటింగ్ 40 శాతం పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఇటీవల మెగాస్టా్ర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేయగా, దానికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. కాగా ఈ సినిమాలో చిరు సరికొత్త లుక్‌లో దర్శనమిస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
అయితే ఈ సినిమా షూటింగ్ అనుకున్న దానికంటే ఎక్కువ ఆలస్యం అవుతుండటంతో ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. కాగా ఈ సినిమా రిలీజ్ విషయంలో కొరటాల ఫుల్ క్లారిటీగా ఉన్నట్లు తెలుస్తోంది. తొలుత ఈ సినిమాను సంక్రాంతి బరిలో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించినా, ప్రస్తుతం కరోనా కారణంగా ఈ సినిమా రిలీజ్‌ను వేసవికి మార్చారు. అయితే తాజాగా ఈ సినిమా రిలీజ్ విషయంలో ఓ డేట్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.
ఆచార్య చిత్రాన్ని 2021 ఏప్రిల్ 9న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఈ సినిమాను సోషల్ మెసేజ్‌తో కూడుకున్న పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా చిత్ర యూనిట్ తెరకెక్కిస్తోంది. ఈ సినిమాలో చిరు పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను కట్టిపడేయడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి. ఇక ఈ సినిమాలో ఓ కేమియో పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తుండగా, అందాల భామ కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. కాగా ప్రస్తుతం కరోనా ప్రభావంతో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది.