Home సినిమా టాలీవుడ్ న్యూస్ చిరు బర్త్‌డే ట్రీట్ రెడీ!

చిరు బర్త్‌డే ట్రీట్ రెడీ!

Chiranjeevi Acharya Pre Look Creates Buzz

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ ఇప్పటికే 40 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాను పూర్తి కమర్షియల్ ఎంటర్‌టైనర్ మూవీగా కొరటాల తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

అయితే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిరు పుట్టినరోజు కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఆగస్టు 22న చిరు తన పుట్టినరోజును జరుపుకుంటుండటంతో ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. కాగా ఈ సినిమాలో చిరు సరికొత్త లుక్‌లో కనిపిస్తాడని చిత్ర యూనిట్ తెలిపింది. ఇక ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌కు సంబంధించిన ప్రీలుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్‌లో చిరు ఓ ఎర్ర గుడ్డను చేతిలో పట్టుకుని కనిపించాడు.

మొత్తానికి చిరు 152వ చిత్రంగా వస్తున్న ఈ సినిమాతో అదిరిపోయే హిట్ అందుకునేందుకు చిరు రెడీ అవుతున్నాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాలో కేమియో పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను నిరంజన్ రెడ్డితో కలిసి చరణ్ నిర్మిస్తున్నాడు. మరి ఈ సినిమా ఫస్ట్ లుక్ చిరు పుట్టినరోజున ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి అంటున్నారు మెగా ఫ్యాన్స్.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad