Home సినిమా టాలీవుడ్ న్యూస్ ఆచార్య ఫస్ట్ లుక్‌తో అదరగొట్టిన మెగాస్టార్

ఆచార్య ఫస్ట్ లుక్‌తో అదరగొట్టిన మెగాస్టార్

Chiranjeevi Acharya Movie First Look Released

మెగాస్టా్ర్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘ఆచార్య’కు సంబంధించిన అప్‌డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు కొరటాల శివ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై అతిభారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను నేడు మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేశారు.

ఈ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌లో చిరు చాలా అగ్రెసివ్‌గా చేతిలో కత్తి పట్టుకుని కనిపించాడు. ధర్మస్థలి అనే ఊరికి సంబంధించిన జనం కష్టాలను తాను తీర్చేందుకు నడుం కట్టినట్లు చిరు ఈ సినిమాలో నటిస్తున్నట్లు మనకు ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే తెలుస్తోంది. కొరటాల శివ తనదైన శైలిలో ఈ సినిమా కథను రెడీ చేసినట్లు ఈ ఒక్క ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌తో తేల్చేశాడు. కాగా ఈ సినిమా ఎండోమెంట్‌లో జరిగే అన్యాయాలకు సంబంధించిందిగా ఉండబోతున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

ఇక ఈ సినిమాను నిరంజన్ రెడ్డితో కలిసి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాడు. కాగా ఈ సినిమాలో ఓ కీలకమైన కేమియో పాత్రలో చరణ్ స్వయంగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. గతంలో చిరు 150వ చిత్రం ‘ఖైదీ నెంబర్ 150’లో ఆడిపాడిన ఈ బ్యూటీ, మరోసారి చిరుతో చిందులు వేయనుంది. ఇక మెగాస్టార్ బర్త్‌డే గిఫ్టుగా వచ్చిన ఈ పోస్టర్‌ను మెగా ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు.

Acharya Motion Poster - Megastar Chiranjeevi | Koratala Siva | Niranjan Reddy | Ram Charan
- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad