ఏపీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ దేశవ్యాప్తంగా రాజకీయ వాతావరణం వేడెక్కుతుంది. నేతలు ఒకరిమీద ఒకరు తిట్ల వర్షం కురిపించుకుంటున్నారు. దీనితో ఇంకాస్త వేడి రోజురోజుకు పెరుగుతూనే ఉంది. పవన్ కళ్యాణ్ ఈ మధ్య భీమవరం సభలో తెలంగాణను పాకిస్థాన్ తో పోల్చడంతో ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణ మురళి కౌంటర్ ఇచ్చాడు. ఆ సభలో తెలంగాణ పాకిస్తానా? హైదరాబాద్ లో నున్న ఆంధ్ర వారి భూములను ఆక్రమిస్తాడా? ఎలా ఆ భూములను తీసుకుంటాడు నేను చూస్తా ?తెలంగాణ ప్రాంతంలో ఆంధ్రులు రాజకీయం చేయవద్దా? కేసీఆర్ మాత్రం ఆంధ్ర రాజకీయాల్లో జగన్ తో కలవవచ్చా? పోనీ అని చూస్తుంటే ఎక్కి తోక్కేస్తున్నారు అంటూ వాఖ్యానించారు. తాజాగా సినీ రచయిత చిన్ని కృష్ణ ఈ విషయం పై స్పందిస్తూ ఆగ్రహానికి గురయ్యారు. కాపులంటే కేవలం మెగా ఫ్యామిలి మాత్రమే కాదు.. మేము కాపు వాళ్ళమే అని తెలిపారు.
ఈ రోజు ఉదయం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ రాజకీయ వర్గాల్లో పెను దూమారం రేపిన అతని వ్యాఖ్యలపై స్పందించి మాఫై దాడి జరిగితే పవన్ కాపాడతాడా?లేక అతని అన్న నాగబాబు కాపాడతాడా? ఇంద్ర లాంటి గొప్ప సినిమాలను చిరంజీవికి అందించాను. ఎన్నో రికార్డ్స్ ని తిరగరాసింది ఆ సినిమా. అలాంటి నేను అతని ఇంటికి వెళ్తే కనీసం టిఫన్, భోజనం కూడా పెట్టని సంస్కారం.. ఘనత ఆ కుటుంబానిది అంటూ తీవ్రమైన విమర్శలు కురిపించారు.
చిరంజీవి ప్రజారాజ్యము పార్టీ పెట్టి ఆ తర్వాత దానిని కాంగ్రెస్ లో విలీనము చేశాడు. ఇప్పటి వరకు అతనికి ఓట్లు వేసిన ప్రజలను ఒక్కసారైనా కలిశాడా? అంటూ ప్రశ్నించాడు. రాబోయే ఎన్నికలలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విజయం తధ్యమని భావించిన టీడీపీ , కాంగ్రెస్ , జనసేన పార్టీలు కావాలనే అతనిని ఇబ్బంది పాలు చేస్తున్నారని ప్రస్తావించాడు.