Home సినిమా 'చీకటి గదిలో చితక్కొట్టుడు'.. మూవీ రివ్యూ

‘చీకటి గదిలో చితక్కొట్టుడు’.. మూవీ రివ్యూ

సంతోష్ పి జయకుమార్ దర్శకత్వం లో తెరకెక్కిన అడల్ట్ హార్రర్ కామెడీ సినిమా ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’. తమిళములో ‘ఇరుత్తు అరియాలి మురుత్తుకుత్తు’ పేరు మీద విడుదలై అక్కడ హిట్ సాధించిన సినిమాను తెలుగులో రీమేక్ చేశారు. ఆదిత్, నిక్కీ తంబోలి , భాగ్యశ్రీ మోతే , మిర్చి హేమంత్ ప్రధాన పాత్రలు పోషించారు. వెండి తెరకెక్కిన సినిమా ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో చూద్దాం రండి..

కథలోకి వెళ్తే..

ఆదిత్ చందు గా, నికి తంబోలి పూజగా , హేమంత్ శివ పాత్రలో నటించారు. ఆదిత్ పెళ్లిచూపుల కోసం ఓ ఇంటికి వెళ్తాడు. ఆ పెళ్లి చూపులో చందు పూజను చూస్తాడు. అంతే ఇక అమ్మాయిని చూసిన గురుడు ఆమె అందానికి ఫిదా అయిపోతాడు. పూజ వాళ్ళ నాన్న ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరగాలని ఏదైనా ట్రిప్ కి వెళ్లండంటూ చెప్తాడు. వాటితో పాటు కండీషన్స్ అప్లై అనగానే , చందు బంపర్ ఆఫర్ ని వదులుకోలేక అన్ని కండిషన్స్ కి ఓకే అని తల ఊపేస్తాడు. ఇక ఇద్దరు మాత్రమే ట్రిప్ ఎందుకని చందు స్నేహితుడు శివను కూడా రమ్మని అడుగుతారు. శివ అతని గర్ల్ ఫ్రెండ్ తో సిద్దమవుతాడు. నలుగురు కలిసి బ్యాంకాక్ వెళ్తారు.

ఒక అడవి. ఆ అడవిలో బూత్ బంగ్లా. ట్రిప్ కోసం వెళ్లిన ఇద్దరు జంటలు ఆ బంగ్లాలో బస చేస్తారు. అందులో దయ్యం ఉంటుంది. ఆ దయ్యానికి సెక్స్ పిచ్చి. ఆడవాళ్లెనేమి చేయదు. మగవాళ్ళను మాత్రమే వేదిస్తుంటుంది. ఇంతకీ ఆ దయ్యం ఎందుకు అలా చేస్తుంది? ఆ దయ్యం భారిన పడిన రెండు జంటలు తప్పించుకుంటారా ? ఆ బంగ్లా లో దయ్యంతో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు? చివరకు దయ్యం స్టోరీ ఎలా ముగుస్తుంది ? అనేది మాత్రం తెర మీద చూడాల్సిందే .

కథ కన్నా బూతు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో అస‌భ్య‌క‌రంగా బూతు బొమ్మ‌ల‌తో నింపేసారు. సినిమాలో ఏ మాత్రం ట్విస్ట్ లేదు. ముఖ్యంగా దయ్యంగా ఎందుకు మారిందనే విషయం చాలా సిల్లీగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ లో రఘుబాబు, తాగుబోతు రమేష్ ల కామెడీ అట్రాక్ట్ చేసింది. నిక్కీ, భాగ్యశ్రీలు ఎక్సపోసింగ్ ఎక్కువైంది. అడల్ట్ కామెడీని ప్రేక్షకులకు అందించడంలో, థ్రిల్ చేయడం లో దర్శకుడు ఫెయిల్ అయ్యాడు. కథ కామన్, సంగీతం నార్మల్ అని చెప్పవచ్చు. ఎడిటింగ్ ,సినిమాటోగ్రఫీ పని బాగుంది. మొత్తముగా చూసుకుంటే ఫ్యామిలీ ఆడియన్స్ సినిమా చూడకపోవడం బెటర్.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad