Home టాప్ స్టోరీస్ నేను చనిపోయిన వాళ్ళ షూటింగ్ చేసుకుంటారు: శివ‌పార్వ‌తి

నేను చనిపోయిన వాళ్ళ షూటింగ్ చేసుకుంటారు: శివ‌పార్వ‌తి

shiva pravathi1597830478

సిని ఇండస్ట్రీ పైకి చూడడానికి రంగుల ప్రపంచంగా ఉన్న లోలోపల జరిగే దారుణాలు బయటకు తెలియవు. షూటింగ్ సమయంలో నవ్వుకుంటూ ఒకే కుటుంబంగా ఉన్నా ఆర్టిస్టులు కష్టం రాగానే తమ గుడు తాము చూసుకుంటున్నారని తాజాగా ఓ సంఘటన నిరూపించింది. బుల్లి తెర ప్రేక్షకులకు అత్యంత సుపరిచితమైన నటి శివ‌పార్వ‌తి. తాజాగా శివ పార్వతికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఆమె పరిస్థితి క్రిటికల్ గా ఉండడంతో దాదాపు రెండు ఆసుపత్రులకు మారవలసి వచ్చింది. ఒకవైపు ఆర్థికంగా మరోవైపు మానసికంగా క్రుంగిపోయిన క్షణంలో ఆమెను చూడటానికి ఎవరు రాలేదని కన్నీటి పర్యంతమయ్యారు. ఆమె మాటల ద్వారా ఇండస్ట్రీలో ఉన్న నకిలీ మొహాల, వాళ్ళ జస్వరూపాలు బయటపడినట్లు తెలుస్తోంది. కరోనా నుండి కోలుకొని ఇంటికి వచ్చిన ఆమె తన అభిమానుల కోసం  వీడియో సందేశాన్ని విడుదల చేశారు.

ఈ వీడియోలో మాట్లాడుతూ “ప్రభాకర్ నటిస్తూ నిర్మిస్తున్న వదినమ్మ సీరియల్ లో నేను  క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నాను. ఆ సమయంలోనే నాకు కరోనా సోకింది, దాదాపు పది రోజులు ఆసుపత్రిలో ఉన్నాను. ఈ విషయం ప్ర‌భాక‌ర్‌కు, అత‌ని యూనిట్‌కు కూడా తెలుసు అయినా ఎవరు తనని పరామర్శించిన లేదని కనీసం ఒక ఫోన్ కూడా చేయలేదని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ విష‌యంలో నేను ఎవ‌ర్నీ ఏమీ అన‌దలుచుకోలేదు. థ్యాంక్స్ చెప్ప‌ద‌ల్చుకున్నాను. ఎందుకంటే ఈ ప‌రిస్థితి రాక‌పోతే ఎవ‌రేంటి?‌ అని తెలిసేది కాదు. కానీ ఇప్పుడు తెలిసిందన్నారు. ఇక్కడ ఎవరి సమస్య వాళ్లదే, న‌టించామా? ఆ క్ష‌ణాన్ని, ఆ ప్ర‌దేశాన్ని, ఆ మ‌నుషుల‌ను అక్క‌డితో మర్చిపోయామా అనే విధంగా ఉండాలి తప్ప ఎదుటి వారి నుండి ఏది ఆశించకూడదు అని చెప్తూ భావోద్వేగానికి లోనయ్యారు. ప్రస్తుత పరిస్థితులు కృత్రిమంగా తయారయ్యాయని ఒకప్పుడు నా ఆరోగ్య పరిస్థితి బాగోలేనప్పుడు జీవిత రాజ‌శేఖ‌ర్ ఆస్ప‌త్రికి వచ్చి పరామర్శించారు.  కానీ నేడు కొంత మంది ఆర్టిస్టులు తనను పట్టించుకోవడం కూడా లేదని. నేను మరణించిన వాళ్లు హ్యాపీగా సీరియల్ తీసుకుంటారని ఫైర్ అయ్యారు. శివ‌పార్వ‌తి విడుదల చేసిన వీడియో ఇప్పుడు ఇండస్ట్రీని కుదిపేస్తోంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ ల పరిస్థితి ఈ స్థాయిలో ఉంటుందని అని తెలుసుకున్న ప్రేక్షకులు కూడా కన్నీటి పర్యంతం అవుతున్నారు. 

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad