Home సినిమా చంద్ర‌బాబు స‌ర్కార్ ఆర్థికంగా ఆదుకుంటోంది : క‌రాటే క‌ళ్యాణి

చంద్ర‌బాబు స‌ర్కార్ ఆర్థికంగా ఆదుకుంటోంది : క‌రాటే క‌ళ్యాణి

క‌రాటే క‌ల్యాణి, టాలీవుడ్‌లోకి క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చి ఆ త‌రువాత త‌న న‌ట‌నతో కుర్ర‌కారును ఆక‌ట్టుకుంటూ సినీ అవ‌కాశాల‌ను ద‌క్కించుకుంటోంది. ఇప్ప‌టికే క‌రాటే కళ్యాణి న‌టించిన ప‌లు సినిమాల డైలాగ్‌లు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అయిపోతున్నాయి. వాటిలో అబ్బా బాబ్జీ, అబ్బ చింపేశారు అనే డైలాగ్‌లు ఫేమ‌స్‌. ఈ డైలాగ్‌ల‌నే క‌రాటే క‌ళ్యాణి తాను ఏ ప్రోగ్రామ్‌లో పాల్గొన్నా గుర్తు చేస్తూ త‌న అభిమానుల‌ను అల‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఇదిలా ఉండ‌గా, క‌రాటే క‌ళ్యాణి ఇటీవ‌ల ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ ఏపీ ప్ర‌భుత్వం త‌న‌కు చేస్తున్న ఆర్థిక స‌హాయం గురించి వివ‌రించింది. త‌న‌కు శ్రీ ఆదిభ‌ట్ల శ్రీ క‌ళాపీఠం ఉంద‌ని, దానిని 11 సంవ‌త్స‌రాలుగా నిర్వ‌హిస్తున్న‌ట్లు చెప్పుకొచ్చింది. శ్రీ క‌ళాపీఠం ఖ‌ర్చుల‌న్నింటిని నేనే భ‌రిస్తా. అంతేకాకుండా హ‌రిక‌థ‌కులకు, క‌ళాకారులుగా ఉంటూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారంద‌ర్నీ ఆదుకోవాల‌నే కోరిక‌తో వారి కోసం త‌న‌ ద‌గ్గ‌ర ఉన్నంత‌లో ఖ‌ర్చు పెడుతుంటానంటూ చెప్పింది క‌రాటే క‌ళ్యాణి.

శ్రీ క‌ళాపీఠం ద్వారా క‌ళాకారుల‌కు నేను చేస్తున్న స‌హాయ కార్య‌క్ర‌మాల‌ను చంద్ర‌బాబు స‌ర్కార్ దృష్టికి తీసుకెళ్లా. అందుకు స్పందించిన చంద్ర‌బాబు ప్ర‌భుత్వం త‌రుపున గ‌త నాలుగేళ్ల నుంచి స‌పోర్టును అంద‌జేస్తున్నార‌ని చెప్పింది. ప్ర‌భుత్వం స‌పోర్టు చేయ‌గా మిగిలిన అవ‌స‌రాల కోసం సినిమాల ద్వారా తాను సంపాదించిన మొత్తాన్ని ఖ‌ర్చు చేస్తానంటూ చెప్పుకొచ్చింది క‌రాటే క‌ళ్యాణి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad