Home సినిమా ఈసారైనా విజయం దక్కేనా ! పాపం చాందిని.

ఈసారైనా విజయం దక్కేనా ! పాపం చాందిని.

Chandini Choudhary Latest Film

టాలీవుడ్ సినిమాలు ఏ భాషలో ఉంటాయి ? ఏంటి అర్థం లేని ప్రశ్న అని అనుకోవద్దు ఎందుకంటే? మనం తెలుగు సినిమాలు చూస్తూ ఉన్నా ..అందులో నటించే నటీనటులు ఏ భాషలకు చెందిన వాళ్ళో మీరు ఎప్పుడైనా ఆలోచించారా. టాలీవుడ్ లో ప్రస్తుతం అగ్ర కథానాయకలుగా వెలుగుతున్న చిరంజీవి,మహేష్ బాబు, రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి పేరు పొందిన కథానాయకలు తెలుగువారు కావడం విశేషం. అందుకే టాలీవుడ్ అంటే తెలుగు అనే విషయం మనకు గుర్తుకు వస్తుంది. తెలుగు కధానాయకులు సక్సెస్ ట్రాక్ ఎక్కినప్పటికీ తెలుగు హీరోయిన్స్ మాత్రం అవకాశాలకు లభించక దూరంగా ఉంటున్నారు.

అంజలి వంటి టాలెంటెడ్ హీరోయిన్ తెలుగు నుండే పరిచయం అయినప్పటికీ ఇక్కడ అవకాశాలు లభించక కోలీవుడ్ కు షిఫ్ట్ అయ్యిపోయింది. ఇప్పుడు ఈ లిస్టులో సరికొత్త పేరు చేర్చే అవాకాశం ఉంది. తెలుగు షార్ట్ ఫిల్మ్స్ చూసే వాళ్ళందరికీ చాందిని చౌదరి గురించి వారందరికీ ప్రత్యేక చెప్పనవసరం. ప్రేమ ప్రేమ, లవ్ ఎట్ ఫస్ట్ సైట్, ట్రూ లవ్, అప్రోచ్, ప్రపోజల్, మధురం, సాంబార్ ఇడ్లీ, లక్కీ, టూ సైడ్ లవ్, ఫాల్ ఇన్ అవ్, రోమియో జూలియట్ వంటి షార్ట్ ఫిలిమ్స్ తో చాందినికి మంచి గుర్తింపు దక్కించుకుంది. తరువాత లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఈ సినిమాతో తెరంగేట్రం చేసి శమంతకమణి, బ్రహ్మోత్సవం సినిమాల్లో నటించింది.

భారీ సినిమాల్లో నటించినప్పటికీ ఈ అమ్మడుకు విజయం మాత్రం దక్కలేదు. తాజాగా చాందినీ చౌదరి ‘కలర్ ఫోటో’ అనే చిన్న సినిమాలో నటిస్తుంది. ‘హృదయ కాలేయం’, ‘కొబ్బరిమట్ట’ వంటి స్పూఫ్ చిత్రాలను తీసిన అమృత ప్రొడక్షన్స్ హ్యాపెనింగ్ కమెడియన్ అండ్ ఆర్టిస్ట్ సుహాస్‌ని హీరోగా పరిచయం చేస్తూ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా టీజర్ ను రౌడీ హీరో విజయ్ దేవరకొండ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ టీజర్ సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకుంది. అటు యూట్యూబ్ లో భారీగా లైక్స్ వస్తున్నాయి. అయితే ఈసారైనా ఈ తెలుగమ్మాయి చాందినీ చౌదరికి కలర్ ఫోటో మరుపురాని చిత్రంగా మిగులుతుందో లేదో చూడాలి.

అయితే ఇండస్ట్రీలో కొంతమంది బడా నిర్మాతలు తెలుగు హీరోయిన్లు కంటే బాలీవుడ్ బాలీవుడ్ తారలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారనే విషయం గత కొంతకాలంగా వినిపిస్తుంది. అయినప్పటికీ టాలెంట్ ఉన్నా తెలుగు హీరోయిన్స్ ను ప్రోత్సహించడానికి మన తెలుగు అభిమానులు ఎప్పుడు సిద్ధంగా ఉన్నారన్నది నిజం.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad