Home సినిమా గాసిప్స్ బన్ని ఫాన్స్ కి క్రేజీ న్యూస్ : దేవుడా..!

బన్ని ఫాన్స్ కి క్రేజీ న్యూస్ : దేవుడా..!

jpg 2

అల వైకుంఠపురం సినిమా తర్వాత అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరో అయిపోయాడు. ఈ సినిమాలోని పాటలు మొత్తం ప్రపంచాన్ని ఉర్రూతలూగించాయి. సినిమా తెచ్చిన క్రేజ్ ను బన్ని పుష్ప సినిమా కోసం వినియోగించుకుంటున్నాడు. ఇప్పటి వరకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అన్ని సినిమాల్లో కెల్లా ఈ సినిమా చాలా వైవిధ్యంగా ఉండనుందని తెలుస్తోంది. ఇందులో అల్లుఅర్జున్ ఎర్రచందనం స్మగ్లర్ గా నటించడంతో పాటు నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ ను చేస్తున్నాడు. ప్రతి సినిమాలో వైవిధ్యం ఉండేలా చూసుకునే అల్లుఅర్జున్ ఈ సినిమా కోసం ఒక ప్రత్యేకమైన సప్రైజ్ ప్లాన్ చేసినట్లు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

పుష్ప సినిమాలోని పాత్ర కోసం చాలా రఫ్ అండ్ టఫ్ గా మారిన బన్ని దాదాపు పది కేజీల బరువు తగ్గారంటా ! ముఖ్యంగా ముఖంలో ఆ గంభీరత్వం ముఖంలో కనిపించడం కోసం తీవ్రమైన వర్కౌట్లు చేసినట్లు వినికిడి. తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం స్టైలిష్ స్టార్ పుష్ప సినిమాలో సిక్స్ ప్యాక్ లుక్ లో కనిపించే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే అది నిజమని అనిపించక మానదు. పుష్ప సినిమా తెలుగుతో పాటు మరో నాలుగు భాషల్లో విడుదల కానుంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం బన్ని సిక్స్ ప్యాక్ చేసినట్టు టాలీవుడ్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

లేటెస్ట్ గా మెగా డాటర్ నిహారిక నిశ్చితార్థ వేడుకల్లో హాజరైన బన్నీను చూస్తే ఈ సరికొత్త ఫిట్నెస్ లుక్స్ పర్ఫెక్ట్ గా కనిపిస్తున్నాయి. వరుస పరిణామాలు చూస్తుంటే పాన్ ఇండియన్ ఎంట్రీ కోసం బన్నీ గట్టిగా కసరత్తు చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఈ ఊహాగానాలు పై మూవీ టీం స్పందించే అవకాశం ఉంది. 

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad