Home సినిమా బన్నీ కోసం 'ఐజి'ని కలిసిన సుకుమార్ ..!

బన్నీ కోసం ‘ఐజి’ని కలిసిన సుకుమార్ ..!

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్, సుకుమార్ కలిసి థర్డ్ కాంబినేషన్లో సినిమా రాబోతుంది. ఇప్పటికే ఆర్య, ఆర్య2 సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టారు. ‘నా పేరు సూర్య’ తరవాత గ్యాప్ తీసుకున్న అల్లుఅర్జున్ బర్త్డే తర్వాత నుంచి జోరు పెంచాడు.

బన్నీ ఈ ఏడాదికి గాను వరుస సినిమాతో బిజీగా ఉన్నాడు. త్రివిక్రమ్ డైరెక్షన్ లో రాబోయే సినిమా గత నెల లాంచ్ చేశారు. మరో వైపు ఎంసిఏ డైరెక్టర్ శ్రీరామ్ వేణు, అల్లు కాంబినేషన్ మూవీకి ‘ఐకాన్’ అనే టైటిల్ ఖరారు చేశారు. తాజాగా వీటితో పాటు సుకుమార్ కి బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై రాబోతున్న ఈ మూవీకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్నీ అందిస్తున్నాడు.

మైత్రి మూవీ మేకర్స్ కి సుకుమార్ రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ అందించాడు. అల్లు, సుకుమార్, దేవి శ్రీ, మైత్రి మూవీ మేకర్స్ చూస్తుంటే టోటల్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ లో చిత్రం రాబోతుందని అర్ధమవుతుంది. ఎర్రచందనం అక్రమ రవాణా ఇతివృత్తంగా చిత్రాన్ని తెరకెక్కించే నేపథ్యంలో సాగే మరిన్ని వివరాల కోసం దర్శకుడు సుకుమార్, టాస్క్ ఫోర్స్ ఐజి కాంతారావుని తిరుపతిలో భేటీ అయ్యారు. ఎర్రచందనం ప్రాముఖ్యత… ఎర్రచందనం స్మగ్లింగ్.. ఎన్కౌంటర్లు… ఎర్రచందనం కాపాడే పాత్రలో టాస్క్ ఫోర్స్ పాత్ర ఎలా ఉంటుంది. శేషాచలం అడవి ప్రాంతం లో టాస్క్ ఫోర్స్ కుంబిన్గ్, స్మగ్లర్ల దాడులు, చెసింగ్ లు లాంటి అంశాలను చర్చించారట. ఈ చిత్రంలో బన్నీ పాత్ర విభిన్నంగా ఉండబోతుందని సమాచారం. మూవీకి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికార ప్రకటన చేయనున్నారు దర్శకులు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad