Home సినిమా సోషల్ మీడియాకి చెక్ పెట్టిన బ్రహ్మానందం..!

సోషల్ మీడియాకి చెక్ పెట్టిన బ్రహ్మానందం..!

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఏ సినిమా తీసిన ఆ సినిమాలో కామేడి కావాలంటే కామేడి కింగ్ బ్రహ్మానందం తప్పక ఉండాలి. ఏ సినిమా తీసిన ఆ సినిమా హిట్ కొట్టినా, కొట్టకపోయిన బ్రహ్మానందం పాత్ర ఉండి తీరాల్సిందె. చాలా మంది స్టార్ హీరోల సినిమాలో బ్రహ్మానందం పాత్ర చాలా కీలకమైనదిగా ఉండేది. అలాంటిది బ్రహ్మానందం గత కొన్నాళ్లుగా ఏ సినిమాలోనూ సరిగ్గా కనిపించడం లేదు. ఈ మధ్య వచ్చిన సినిమాల్లో బ్రహ్మానందం ఏ సినిమా తీసిన కామేడి పండించలేక పోవడంతో పాటు-మూస తరహాలో కామేడి  ఉంటుందని విమర్శలు వచ్చాయి.

అంతేకాదు ఈ నేపథ్యంలోనే బ్రహ్మానందం ఏ సినిమాలోనూ ఎక్కువగా కనిపించకపోవడతో తన ఆరోగ్యం గురించి సామజిక మాధ్యమాల్లో అనేక వార్తలు వచ్చాయి. ఈ మధ్య అనారోగ్య కారణముచేత బ్రహ్మానందం ముంబైకి వెళ్లి గుండెకు సంబంధించిన ఆపరేషన్ చేయించుకున్నాడు. ఆపరేషన్ కారణంగా ముంబైలో కొన్ని రోజులు ఉండటంతో బ్రహ్మానందం ఆరోగ్యంపై రకరకాలుగా పుకార్లు సోషల్ మీడియాలో షికార్లు చేయడం మొదలు పెట్టాయి. ఇక బ్రహ్మానందం ఆరోగ్యంపై అనేక రకాలుగా వస్తున్న పుకార్లకు మీడియాలో బ్రేక్ పడినట్టే, ఈ మధ్య ఆపరేషన్ తర్వాత ముంబై నుంచి హైదరాబాద్ కు వచ్చిన బ్రహ్మానందంను మోహన్ బాబు కలిసి పరామర్శించాడు.

తాజాగా మోహన్ బాబు, బ్రహ్మానందంను పరామర్శించిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యింది. దీంతో బ్రహ్మానందం ఆరోగ్యాంగా ఉన్నట్టు ఆరోగ్య పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా బ్రహ్మానందం ఉన్నాడని కొన్ని రోజుల్లోనే కెమెరా ముందుకు రాబోతున్నారని, ఆ ఫొటోను చూస్తుంటే తెలుస్తుంది. ఇకపైన బ్రహ్మానందం గురించి సోషల్ మీడియాలో ఎలాంటి వార్తలుకాని పుకార్లు వచ్చినా నమ్మనక్కర్లేదని ఈ ఫొటో చూస్తుంటే అర్ధమవుతుంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad