Home సినిమా గాసిప్స్ నటనకు స్వస్తి చెప్పనున్న అనుష్క శర్మ!

నటనకు స్వస్తి చెప్పనున్న అనుష్క శర్మ!

sharma

బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లో అనుష్క శర్మ ఒకరు. 2008 రబ్ నే బనాదీ జోడీ సినిమా ద్వారా తెరంగేట్రం చేసిన ఈ అమ్మడు మొదటి సినిమాతోనే ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకుంది. బాలీవుడ్లోని టాప్ యాక్టర్స్ అందరితోనూ నటించింది. ఈ క్రమంలో ఆమెకి ఎన్నో హిట్లు, బ్లాక్ బస్టర్లు దక్కాయి. అయితే గత కొంతకాలంగా ఆమె సినిమాలకు దూరంగా ఉంటూ వస్తోంది. చివరిసారిగా 2018లో జీరో అనే సినిమాలో షారుఖ్ ఖాన్ తో నటించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత  అంగ్రేజీ మీడియం సినిమాలో స్పెషల్ సాంగ్ చేసి నటనకు దూరంగా ఉంది. గత కొన్నేళ్లుగా ఆమె హీరోయిన్స్ వంటి ఎటువంటి పాత్రలను చేయలేదు.

గత పదేళ్ళలో ఆమె కేవలం ఆరు సినిమాల్లో మాత్రమే నటించింది. 2011పటియాలా హౌస్, 2012 జబ్ తక్ హై జాన్, 2014 పీకే 2018లో జీరో వంటి సినిమాల్లో మాత్రమే నటించింది. ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీ వివాహం చేసుకున్న తర్వాత ఆమె స్పీడ్ తగ్గింది. అయితే ఆమెకి ఆఫర్లు వస్తున్నప్పటికీ అనుష్క శర్మ వాటిని రిజెక్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఆమె నటనకు ఫుల్ స్టాప్ పెట్టి ప్రొడ్యూసర్ గా మారనుందని బాలీవుడ్ మీడియా వర్గాలు వెల్లడించాయి.

ఈ మధ్యే నిర్మాణ సంస్థను ప్రారంభించిన అమ్మడు పాతాల్ లోక్ , బుల్ బుల్ అనే  రెండు వెబ్ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చింది. ఈ సినిమాలో మంచి విజయం సాధించడంతో నటనకు స్వస్తి చెప్పి పూర్తిస్థాయిలో నిర్మాతగా మారనుందని వినికిడి. దీనిపై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇమే దారిలో మరికొంత మంది భామలు నడవడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే సమంత నిర్మాతగా మారనుందని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. 

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad