Home సినిమా బాలీవుడ్‌కు మ‌రో చాక్లెట్‌బాయ్ దొరికేశాడు..!

బాలీవుడ్‌కు మ‌రో చాక్లెట్‌బాయ్ దొరికేశాడు..!

కార్తీక్ ఆర్య‌న్, ఇప్పుడు ఈ పేరు వింటేనే బాలీవుడ్ బాబులు క‌ల‌వ‌ర‌ప‌డుతున్నారు.సోనుకే టిటూ కి స్వీటీ చిత్రంతో బాలీవుడ్ వెండి తెర‌పై ఎంట్రీ ఇచ్చాడు కార్తీక్ ఆర్య‌న్. ఆ చిత్రం స‌క్సెస్‌తో బాలీవుడ్‌లో ల‌వ‌ర్ బాయ్, బాక్లెట్ బాయ్ అనే ఇమేజ్‌ను అనుభ‌విస్తున్న హీరోల లిస్ట్‌లో ఫ‌స్ట్ ప్లేస్‌ను భ‌ర్తీ చేసేశాడు. ఇప్ప‌టికే సోనూగా ఫీమేల్ ఆడియ‌న్స్‌ను ఫిదా చేసిన కార్తీక్ ఇప్పుడు బాలీవుడ్‌కు కొత్త డ్రీమ్‌ మారుతున్నాడు.

అయితే, సోనుకే టిటూ కీ స్వీటీ థియేట‌ర్‌ల నుంచి వెళ్లిపోయి ఏడాది కావ‌స్తున్నా కానీ, జ‌నాల్లో ఆ మూవీ ఇంపాక్ట్ మాత్రం ఇంకా త‌గ్గ‌లేదు. ముఖ్యంగా అమ్మాయిల్లో కార్తీక్ పిక్చ‌ర్ ఐమాక్స్ రేంజ్‌లో ఉండిపోయింది. ఆ ప్ర‌భావంతోనే సారా అలీఖాన్‌కు కాఫీ విత్ కర‌ణ్‌లో ఏ హీరోతో డేటింగ్‌కు వెళ‌తార‌న్న ప్ర‌శ్న ఎదురైతే వెంట‌నే కార్తీక్ పేరు వ‌చ్చేసింది.

సారా అలీఖాన్ లాంటి స్టార్స్‌లోనూ కార్తీక్‌కు ఉన్న క్రేజ్‌తో ఈ హీరో బాలీవుడ్ రొమాంటిక్స్‌కు ఫ‌స్ట్ ఆప్ష‌న్‌గా మారేలా ఉన్నాడు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు ల‌వ్ స్టోరీజ్‌కు ఆప్ష‌న్‌గా ఉన్న ర‌ణ‌బీర్ క‌పూర్, అర్జున్ క‌పూర్‌లాంటి హీరోలను బీట్ చేసేలా క‌నిపిస్తున్నాడు కార్తీక్ ఆర్య‌న్.మ‌రి ఈ క్రేజ్‌ను మెయింటెన్ చేసేందుకు కార్తీక్ ఎలాంటి సినిమాల్లో న‌టిస్తాడో చూడాలి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad