Home సినిమా క్యాన్సర్‌తో కన్నుమూసిన మార్వెల్ సూపర్ హీరో

క్యాన్సర్‌తో కన్నుమూసిన మార్వెల్ సూపర్ హీరో

Black Panther Star Chadwick Boseman Dies With Cancer

ప్రపంచవ్యాప్తంగా మార్వెల్ తెరకెక్కించే సూపర్ హీరో చిత్రాలకు పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. మార్వెల్ నుండి వచ్చే సినిమాల కోసం ప్రపంచవ్యాప్తంగాప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తుంటారు. ఆ బ్యానర్ నుండి వచ్చిన అనేక సూపర్ హీరోల్లో ‘బ్లాక్ పాంథర్’ కూడా ఒకటి. చద్విక్ బోస్మేన్ నటించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి క్రేజ్‌ను దక్కించుకుందో అందరికీ తెలిసిందే. ఇక బ్లాక్ పాంథర్ పాత్ర పలు అవెంజర్స్ చిత్రాల్లో కూడా కనిపించడంతో, మార్వెల్ అభిమానులు పండగ చేసుకున్నారు.

కానీ అందరికీ షాకిచ్చే న్యూస్ ఇప్పుడు బయటకొచ్చింది. బ్లాక్ పాంథర్ హీరో చద్విక్ బోస్మేన్ తాజాగా మృతి చెందినట్లు హాలీవుడ్ వర్గాలు తెలిపాయి. 43 ఏళ్ల చద్విక్ బోస్మేన్ గతకొంత కాలంగా కొలోన్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ వస్తున్నాడని తెలుస్తోంది. కాగా తాజాగా ఆయన ఆ వ్యాధితో బాధపడుతూ మృతి చెందాడు. దీంతో యావత్ సినీ లోకం ఉలిక్కి పడింది. ఒక మంచి నటుడు మృతి చెందడంతో యావత్ సినీ లోకం విషాదంలోకి వెళ్లిపోయింది.

చద్విక్ బోస్మేన్ మృతి హాలీవుడ్ సినిమాకే కాకుండా యావత్ సినీ లోకానికి తీరని లోటు అని పలువురు కామెంట్ చేస్తున్నారు. కాగా ఆయన నటించిన బ్లాక్ పాంథర్ చిత్రానికి సీక్వెల్‌గా ‘బ్లాక్ పాంథర్ 2’ను తెరకెక్కించేందుకు మార్వెల్ నిర్మాతలు సన్నాహాలు చేస్తుండగా, ఈ విషాదం చోటు చేసుకుంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad