Home సినిమా టాలీవుడ్ న్యూస్ ఈసారైనా సెలబ్రిటీలు వస్తారా? : బిగ్ బాస్ ఫోర్

ఈసారైనా సెలబ్రిటీలు వస్తారా? : బిగ్ బాస్ ఫోర్

biggboss ed 1590466138

తెలుగునాట “బిగ్ బాస్” రియాల్టీ షో కు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే ఈ రియాల్టీ షోలో మూడు సీజన్ లను పూర్తి చేసుకొని భారీ విజయాన్ని అందుకుంది. మొదటి సీజన్‌ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ వ్యవహరించగా, రెండో సీజన్ కు నాని హోస్ట్ గా చేశాడు. మూడో సీజన్ కు అక్కినేని నాగార్జున తన స్టైల్ మార్కింగ్ తో హోస్ట్ గా దుమ్ముదులిపాడు. ప్రస్తుతం బిగ్ బాస్ నాల్గవ సీజన్ వస్తుంది. మాటీవీ తెలిపిన సమాచారం ప్రకారం నాల్గవ సీజన్ కు కూడా నాగార్జున యే హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. వాస్తవానికి బిగ్ బాస్ షో అంటేనే సెలబ్రిటీలతో నడిచే ఒక రియాల్టీ షో. కానీ తెలుగులో ఈ పరిస్థితి పూర్తి విరుద్ధంగా ఉంది.

ఎందుకంటే ? తెలుగు బిగ్ బాస్ షో కు సెలబ్రిటీలు రావడంతో లేదు.. వచ్చిన సాధారణ వ్యక్తులే సెలబ్రిటీలుగా  మారుతున్నారు. ఉదాహరణకు తమిళనాడు పేరుపొందిన ముగెన్ రావు, రిత్విక వంటి వారు రాగా తెలుగు బిగ్ బాస్ మొదటి సీజన్‌ కు ప్రిన్స్ సిసిల్, మధు ప్రియ, సంపూర్ణష్ బాబు, జ్యోతి వంటి వారు వచ్చారు. వీరెవరు పేరు మోసిన సెలబ్రిటీలు కాదు. హీరో ప్రిన్స్, సంపూర్ణష్ బాబు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ జ్యోతి వీళ్ళందరూ ఫేడ్ అవుట్ అయిన స్టార్స్. ఇక రెండో సీజన్లో కూడా ఇదే పరిస్థితి. పుణార్నవి భూపాలం, మహేష్ విట్టా, కౌషల్ మండా వంటి వారు  వచ్చారు. వీరు కూడా సెలబ్రిటీలు కాదు. వాస్తవానికి ఇప్పటివరకు తెలుగు బిగ్ బాస్ కు నిజమైన సెలబ్రిటీలు రానే రాలేదు. ప్రస్తుతం బిగ్ బాస్ ఫోర్ స్టార్ కానుంది. ఇందులో పోటీదారులుగా బడా హీరోలు, సెలబ్రిటీలు వస్తున్నారని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది.

ప్రస్తుతం మన టాలీవుడ్ స్టార్స్ అందరూ చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇక సంగీత దర్శకుల పరిస్థితి కూడా ఇదే. అసలు బిజీగా ఉన్న ఈ సెలబ్రిటీలు బిగ్ బాస్ షోకు ఇన్ని రోజులు డేట్స్ ఇవ్వడం దాదాపు అసాధ్యం. ఎవరైనా బిగ్ బాస్ కి వెళ్తున్నారు అంటేనే  సినిమాల్లో లేక సీరియల్స్ లో బాగా అవకాశాలు తగ్గిపోయినట్టే అని బయట ప్రచారం జరుగుతుంది. దీని ప్రకారం చూసుకుంటే పాత చింతకాయ పచ్చడిలా మరల బిగ్ బాస్ షో కు ఫెడ్ అవుట్ స్టార్స్ వస్తున్నారాన్నది నమ్మలేని నిజం.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad