Home సినిమా టాలీవుడ్ న్యూస్ బిగ్‌బాస్ 4 ఎప్పుడు ప్రారంభం అవుతుందో తెలుసా?

బిగ్‌బాస్ 4 ఎప్పుడు ప్రారంభం అవుతుందో తెలుసా?

big boss 4 thumb

టాలీవుడ్‌లో బుల్లితెరపై ప్రసారమయ్యే రియాలిటీ షోలలో ‘బిగ్ బాస్’కు ఉన్న ప్రత్యేకత గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. బిగ్‌బాస్ తొలిసీజన్‌ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చేయగా, ఆ సీజన్ అదిరిపోయే రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ఇక ఫస్ట్ సీజన్ బ్లాక్‌బస్టర్‌గా నిలవడంతో వరుసగా రెండు, మూడు సీజన్స్‌ను నిర్వహించారు బిగ్ బాస్ నిర్వాహకులు. కాగా రెండో సీజన్‌ను నేచురల్ స్టార్ నాని, మూడో సీజన్‌ను అక్కినేని నాగార్జున హోస్ట్ చేయగా వాటికి కూడా మంచి రెస్పాన్స్ లభించింది.

ఇక ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్న 4వ సీజన్ బిగ్‌బాస్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో బిగ్‌బాస్ షోపై నిర్వాహకులు ఇటీవల క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే ప్రారంభం కానున్న ఈ బిగ్‌బాస్ 4వ సీజన్‌ను కింగ్ నాగార్జున మరోసారి హోస్ట్ చేయనున్నట్లు వారు ప్రకటించారు. కాగా ఈ షోకు సంబంధించిన ప్రోమో షూటింగ్ కూడా పూర్తి చేశారు నిర్వాహకులు. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ షోను ఆగస్టు 30వ తేదీ నుండి ప్రారంభించేందుకు నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు.

ఇప్పటికే ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్ ఎంపిక పూర్తయినట్లు తెలుస్తోంది. ఇక ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ షోను కరోనా వైరస్ సోకుకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ త్వరలోనే ప్రారంభించాలని నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. ఏదేమైనా తెలుగు ఆడియెన్స్‌ను మెప్పించడంలో సక్సెస్ సాధించిన బిగ్‌బాస్ రియాలిటీ షో ఈ నెలాఖరు నుండి మరోసారి వారిని మెప్పించేందుకు వస్తుందనే వార్త ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad