Home సినిమా టాలీవుడ్ న్యూస్ బిగ్‌బాస్ ఫైనల్ కంటెస్టెంట్స్ ఎవరో తెలుసా?

బిగ్‌బాస్ ఫైనల్ కంటెస్టెంట్స్ ఎవరో తెలుసా?

Bigg Boss 4 Contestants Final List

టాలీవుడ్ బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న రియాలిటీ షో ‘బిగ్ బాస్’కు మంచి ప్రేక్షకాదరణ లభించింది. ఇక తొలి సీజన్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా ఉండటంతో ఆ షోకు అదిరిపోయే టీఆర్పీ రేటింగ్ వచ్చిన సంగతి తెలిసిందే. కాగా రెండో సీజన్ బిగ్‌బాస్‌కు నేచురల్ స్టార్ నాని హోస్ట్‌గా ఉండటంతో ఆ సీజన్‌కు కూడా ఆదరణ బీభత్సంగా పెరిగింది. ఇక మూడో సీజన్‌కు నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే.

కాగా ఇప్పుడు బిగ్‌బాస్ 4వ సీజన్‌కు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు నిర్వాహకులు. అయితే ఇప్పటికే ఈ షో ప్రారంభం కావాల్సి ఉంది. కానీ కరోనా వైరస్ ప్రభావంతో వాయిదా పడింది. అయితే ఇప్పుడిప్పుడే షూటింగ్‌లు మొదలవుతుండటంతో బిగ్‌బాస్ రియాలిటీ షోను నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అయ్యారు. కాగా ఈసారి బిగ్‌బాస్ హౌజ్‌లోకి ఎవరు వస్తారా అనే సందేహం అందరిలోనూ నెలకొంది. అయితే వారిలో పలువురి పేర్లు ఇప్పటికే సోషల్ మీడియాలో వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే వారిలో ఫైనల్ లిస్టులో ఉన్నది వీరే అంటూ ఓ జాబిత సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాగా వారిలో పలువురి పేర్లు ఈ విధంగా ఉన్నాయి. సినిమా, టీవీ, యూట్యూబ్, సోషల్ మీడియాలో తమకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న వారిని ఈ జాబితాలో చేర్చుతూ నిర్వాహకులు ఈ జాబితాను రెడీ చేసినట్లు తెలుస్తోంది.

 • సయ్యద్ సోహెల్ (క్రిష్ణవేణి సీరియల్ యాక్టర్, యురేక మూవీ హీరో)
 • మహాతల్లి జాహ్నవి, ఆమె భర్త సుశాంత్
 • రఘు మాస్టర్ & ప్రణవి
 • జెమిని యాంకర్ ప్రశాంతి
 • సింగర్ నోయెల్
 • నందు (గీతా మాధురి భర్త)
 • జబర్దస్త్ ముక్కు అవినాష్
 • కరాటే కళ్యాణి (నటి)
 • జోర్దార్ సుజాత (యాంకర్)
 • మెహబూబా దిల్ సే (టిక్ టాక్ షార్ట్ ఫిల్మ్ స్టార్)
 • యాంకర్ అరియానా గ్లోరీ (జెమిని కెవ్వు కామెడీ యాంకర్)
 • ప్రియ వడ్లమాని
 • అపూర్వ
 • యామినీ భాస్కర్
 • పూనమ్ భజ్వా
 • అకిల్ సార్థక్

మరి వీరిలో బిగ్‌బాస్ హౌజ్‌లో ఈసారి బుల్లితెరపై ఎవరు కనిపిస్తారో తెలియాలంటే ఈ రియాలిటీ షో మొదలయ్యే వరకు ఆగాల్సిందే.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad