Home సినిమా 'కేజిఎఫ్' నటుడిని రెండో పెళ్లి చేసుకున్న.. 'బిగ్ బాస్' ఫేమ్..!

‘కేజిఎఫ్’ నటుడిని రెండో పెళ్లి చేసుకున్న.. ‘బిగ్ బాస్’ ఫేమ్..!

‘లవ్ ఫెయిల్యూర్’ సినిమాతో తెలుగులోకి అడుగిడిన అమ్మడు పూజా రామ చంద్రన్. ఆ తరువాత దేవి శ్రీ ప్రసాద్, మరల తెలుపనాప్రియా, క్రిష్ణార్జునయుద్ధం, దోచెయ్ వంటి సినిమాలలో నటించింది. కానీ పూజా అంతగా పేరు సంపాదించుకోలేకపోయింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ సీజన్ 2లో సందడి చేసి తెలుగు ప్రేక్షకులకు కొంతవరకు చేరువైంది బెంగళూరు భామ.

తాజాగా పూజా రామ చంద్రన్ కేజిఫ్ నటుడుని పెళ్లి చేసుకుంది. కేరళ సంప్రదాయంలో పెళ్లి చేసుకున్నట్లు విషయాన్ని తానే స్వయంగా ఇన్స్టాగ్రామ్ లో అఫీషియల్‌‌గా అభిమానులకు తెలియపరిచింది. అయితే ఇది అమ్ముడుకి ఇది రెండో వివాహము. ప్రముఖ నటుడైన అనీష్ జాన్ కొక్కెన్‌ తో కొన్నాళ్లుగా రిలేషన్ లో ఉన్నారు. ఇప్పుడు కాస్త పెళ్లి బంధంతో ఏకమయ్యారు.

గతంలో పూజ ఎస్ ఎస్ మ్యూజిక్‌లో వీజేగా తన కెరీర్ ను మొదలుపెట్టినప్పుడు, అక్కడే పని చేస్తున్న మరో వీజేని ప్రేమ వివాహం చేసుకుంది. రెండు సంవత్సరాల తరువాత వచ్చిన మనస్పర్థల కారణంగా ఇద్దరు విడాకులు తీసుకున్నారు. నటుడు జాన్ కొక్కెన్‌తో కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నట్లు పుకార్లు వచ్చాయి. కానీ అప్పట్లో మా ఇద్దరిది స్నేహం మాత్రమే.. అవన్నీ పుకార్లే అని చెప్పిన పూజ. అతడినే రెండో పెళ్లి చేసుకొని రూమర్స్ ని కాస్త రియల్ చేసింది.

ఇక నటుడు జాన్ కొక్కెన్ విషయానికొస్తే .. ఇతనికి కూడా ఇది రెండో పెళ్లి. 2012లో నటి మీనా వాసుదేవన్ పెళ్లి చేసుకున్నాడు.. వీరిద్దరి మధ్య వచ్చిన గొడవలతో కోర్టు మెట్లెక్కారు. చివరకు విడాకులు కూడా తీసుకున్నారు. కానీ అప్పటికే వీరిద్దరికి ఒక కొడుకు ఉన్నాడు. ఈ మధ్య విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌ సాధించిన ‘కేజీఎఫ్’ చిత్రంలో జాన్ నటించాడు. పూజ రాంచంద్రన్.. జాన్ కొక్కెన్ లు కలిసి నూతన జీవనాన్ని మొదలు పెట్టబోతున్నట్లు.. సోషల్ మీడియా లో అభిమానులతో పంచుకున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad