Home సినిమా గాసిప్స్ ఆ కథలు మా నుండి లాక్కున్నారు..కొత్త వివాదం

ఆ కథలు మా నుండి లాక్కున్నారు..కొత్త వివాదం

Allu Arjun Pushpa First Look Posters HD

టాలీవుడ్ లో టైటిల్ వివాదాలుతో పాటు కథల కాపీరైట్ వివాదాలు కూడా భారీగా ఉన్నాయి. ముఖ్యంగా భారీ సినిమాలకు ఈ వివాదాలు సాధారణంగా జరుగుతున్నవే. గతంలో శ్రీమంతుడు, మిస్టర్ పర్ఫెక్ట్, సర్కార్, వంటి సినిమాలు కాపీరైట్ వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. సదరు రచయితలు కోర్టుకు ఎక్కడం న్యాయస్థానం వారికి అనుకూలంగా తీర్పు చెప్పడంతో మూవీ నిర్మాతలు వారికి డబ్బును చెల్లించారు.

తాజాగా అటువంటి మరో వివాదం టాలీవుడ్ లో మొదలైంది. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న అల్లు అర్జున్ పుష్ప మరియు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమా కధలు తమ వని ఇద్దరు వ్యక్తులు దర్శక నిర్మాతల పై ఆరోపణలు చేశారు. చిరు ఆచార్య మూవీ కధను తన నుండి అక్రమంగా దొంగిలించారని రచయిత రాజేశ్ మండూరి ఆరోపిస్తున్నారు. కొన్నేళ్ళ క్రితం ఈ కథను మైత్రి మూవీస్ కు వినిపించగా వారు ఆ కథని కొరటాలకు అందించారని సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయంపై డిసెంబర్ నెలలో ఫిర్యాదు చేసినప్పటికీ రైటర్స్ అసోసియేషన్ వారికి అనుకూలంగా మాట్లాడిందని అన్నారు.

ఈ వివాదం కొనసాగుతుండగానే మధ్యలో అల్లు అర్జున్ పుష్ప పైన కూడా ఇటువంటి ఆరోపణలు వెల్లువెత్తాయి. నవలకారులు వెంపల్లి గంగాధర్ ఈ చిత్రం తాను రాసిన తమిళ కూలీ అనే నవల ఆధారంగా తెరకెక్కుతోందని వెల్లడించారు. బన్నీ ఈ సినిమాలో శేషాచలం అడువుల్లో తిరిగే దోపిడీ దొంగగా కనిపించబోతున్నాడు. కాపీహక్కులు విషయంపై ఇప్పటివరకూ మైత్రి మూవీ మేకర్స్ ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. 

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad