Home సినిమా భలే భలే మగాడివోయ్ పార్ట్-2 రానుందా ?

భలే భలే మగాడివోయ్ పార్ట్-2 రానుందా ?

nani

టాలీవుడ్ హీరోల్లో నేచరల్ స్టార్ నానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. నటనతోనూ మంచి మేకోవర్ తో నెంబర్ వన్ స్థానం వైపు అడుగువేస్తున్నాడు. అయితే గత కొంత కాలంగా నాని నటించిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ళును రాబట్ట లేకపోతున్నాయి.భలే భలే మగాడివోయ్ సినిమాతో 40 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టిన నేచురల్ స్టార్ ఆ తరువాత ఆ స్థాయిని అందుకోలేకపోయాడు. ఈ చిత్రం అటు నానికి, ఇటు దర్శకుడు మారుతికి మంచి పేరు తీసుకువచ్చింది. ఆప్పటి వరకు సక్సెస్ లేని నాని సక్సెస్ ట్రాక్ ఎక్కగా, మారుతి స్టామిన ఏంటో నిరూపించింది.మారితి ఈ సినిమాకు సీక్వెల్ తీస్తానని ప్రకటించినప్పటికీ ఇప్పటికే ఆ సినిమా పట్టాలెక్కలేదు. నాని ఇంద్రగంటి మోహన్ కృష్ణ సినిమాతో బిజీగా ఉండడం తరువాత శ్యామ సింగరాయ్ సినిమాకు ఒక చెప్పడంతో వీరి కాంబో పిక్స్ కాదని చాలా మంది అనుకున్నారు. తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సక్సెస్ కాంబో మరో సారి రిపీట్ కానుందని తెలుస్తోంది. అందులో భాగంగా మారుతి, నాని కోసం ఫుల్ ఎంటర్ టైనర్ ను సిద్ధం చేస్తోన్నట్లు సమాచారం. ప్రస్తుతం కధను పూర్తి చేసి నానికి వినిపించాడంట.. కధ నచ్చడంతో నాని కూడా ఓకే చెప్పినట్టు తెలిస్తుంది. ఈ కధ భలే భలే మగాడివోయ్ కు సీక్వల్ హ లేక మరో సరికొత్త కధ అన్నది ఇంకా తెలియలేదు. ప్రస్తుతం నాని చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు నాని మారితి సినిమాను ముందు చేసి తరువాత ఇతర సినిమాలు చేస్తారా ? లేక మల్టీట్రాక్ మూవీస్ గా అన్నింటిలో ఒకే సారి యాక్ట్ చేస్తారా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. టాలీవుడ్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను అల్లు అరవింద్ గీత ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది.ప్రస్తుతం నాని నటించిన ‘వి’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. తరువాత ‘టక్ జగదీష్’సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రాలన్నీ 2021లో విడుదలయ్యే అవకాశం ఉంది. నాని మారుతి కాంబో ఫిక్స్ అయినట్టయితే టాలీవుడ్ కి మరో మరో బిగ్గెస్ట్ హిట్ దొరికినట్టే. దీని పై ఇంకా మూవీ టీం స్పందించాల్సి ఉంది

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad