Home టాప్ స్టోరీస్ సుధీర్ బాబు సిక్స్ ప్యాక్: నాని సీక్రెట్

సుధీర్ బాబు సిక్స్ ప్యాక్: నాని సీక్రెట్

nani v 1200

కొంతమంది విలన్ లు సినిమా ఏదైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా సరే తమ కండలను చూపిస్తూ హీరో గుండెల్లో మంటగా పుట్టిస్తుంటారు. తమ ఆరు పలకల దేహాన్ని సిల్వర్ స్క్రీన్ పై చూపించడం వారి ప్రత్యేకత. తెలుగు లో సిక్స్ ప్యాక్ ట్రెండ్ ను అల్లు అర్జున్ తీసుకురాగా ఇప్పటికీ ఆ మానియా కొనసాగుతూనే ఉంది. నాని నటించిన వి సినిమాలో సుధీర్ బాబు ముఖ్య పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఇందులో సుధీర్ టఫ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తారని సమాచారం. తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఇందులో ఒక భారీ యాక్షన్ సీన్ ఉండనుందని తెలుస్తోంది. ఇందులో సుధీర్ బాబు తన సిక్స్ ప్యాక్ ని చూపించడంతో పాటు నాని కి గట్టి పోటీ ఇస్తున్నారని ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం సాగుతోంది.

సినిమాలో యాక్షన్ సీన్లు హాలీవుడ్ స్థాయిలో ఉండనుందని తెలుస్తోంది. హీరో సుధీర్ బాబు కు మొదటి నుండి ఫిట్ నెస్ మీద శ్రద్ద ఎక్కువ. ఇద్దరు పిల్లల తండ్రి అయినా, నలభై ఏళ్ల మిడిల్ ఏజ్డ్ లోకి వచ్చినా, ఫుల్ ఫిట్ తో వుంటారు. ఇప్పటికీ ఇంకా సిక్స్ ప్యాక్ మెయింటెయిన్ చేస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 5న అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది. అయితే మూవీ యూనిట్ పర్టికులర్ గా అదే రోజును ఎన్నుకోవడానికి ఒక కారణం ఉంది. నాని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఈ సినిమాతో పన్నెండేళ్లు పూర్తి కానుంది. నాని మొదటి సినిమా అష్టా చమ్మ సెప్టెంబర్ 5న విడుదలై మంచి విజయాన్ని సాధించింది.  అందుకే అదే రోజున నాని 25వ సినిమాని విడుదల చేయాలని మూవీ టీం డిసైడ్ అయినట్టు జోరుగా ప్రచారం సాగుతోంది.

మొదటి సినిమాను థియేటర్లలో విడుదల చేద్దామనుకున్నప్పటికీ పరిస్థితులు అనుకూలించక నిర్మాత దిల్ రాజు అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ లో సుధీర్ బాబు మెయిన్ లీడ్ క్యారెక్టర్ చేస్తుండగా, నివేత థామస్ మరియు అదితి రావ్ హైదరీలు హీరోయిన్స్ గా కనిపించనున్నారు. సమ్మోహనం ప్రేమ్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంవహించారు. 

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad