Home సినిమా భారీ బడ్జెట్ తో పవన్ సినిమా.. పారితోషకం ఎంతో తెలుసా..! బండ్ల గణేష్

భారీ బడ్జెట్ తో పవన్ సినిమా.. పారితోషకం ఎంతో తెలుసా..! బండ్ల గణేష్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పరిమితమై సభలు, సమావేశాలు నిర్వహించుకుంటూ జనంలోకి పార్టీ ని తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. అలుపెరగని యోధునిలా ప్రజల మధ్యే పోరాటం కొనసాగించాడు. కానీ ఆయనకు అపజయమే ఎదురైంది. రాజకీయ పదవిని ఆశించకపోయిన, ప్రజల సేవలోనే ఉంటానని చాలా సార్లు చెప్పాడు. కానీ మరో ఐదు సంవత్సరాల వరకు చేసేది ఏమి లేదు కాబట్టి సినిమాలే చేస్తాడనే టాక్ వినిపిస్తుంది.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ గ్యాప్ లో సినిమా చేస్తానని అంటే ఎంతోమంది దర్శక నిర్మాతలు క్యూ కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. తాజగా బండ్ల గణేశ్ పవన్ తో సంప్రదింపులు జరిపి  సినిమాకు ఒప్పించినట్లు సమాచారం. బోయపాటి దర్శకత్వంలో, బండ్ల గణేష్ నిర్మాణంలో తెరకెక్కపోవు సినిమాకు పవన్ కి 40 కోట్ల రూపాయలను పారితోషకంగా ఇస్తానని గణేష్ చెప్పాడట.

దీనికోసం మొత్తం ఆర్టిస్ట్ లతో కలిపి యాభై కోట్ల ఖర్చు అవుతుందని,  భారీ బడ్జెట్ తోనే సినిమాను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇందులో వాస్తవమనేది ఎంత అనేది తెలియాల్సి ఉంది. మరో పక్క పవన్ ఫ్యాన్స్ సినిమాల హిట్ లలోను , ప్లాప్ లలోను తోడున్నాము. రాజకీయం లో ఓడినా, గెలిచినా పవన్ తోనే ఉంటాము.. పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా జన సైనికులము వెన్నంటి ఉంటామని చెప్తున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad