Home సినిమా టాలీవుడ్ న్యూస్ సోనూ సూద్ బాటలో బండ్ల బాబు

సోనూ సూద్ బాటలో బండ్ల బాబు

Bandla Ganesh Helping Like Sonu Sood

ఇటీవల కరోనా వైరస్‌ను నివారించేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలు చేయడంతో ప్రజలు నానా అవస్థలు పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వలస కార్మికుల పాలిట దేవుడిగా మారాడు బాలీవుడ్ నటుడు సోనూ సూద్. లాక్‌డౌన్‌లో వలస కార్మికులు తమ సొంత గూటికి చేరేందుకు తన సొంత ఖర్చులతో సాయం చేయగా, ఇటీవల ఏపీలో ఓ రైతు పడుతున్న కష్టానికి చలించిపోయి అతడికి ట్రాక్టర్‌ను కొనిచ్చే వరకు సోనూసూద్ నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు. అయితే తాను ఇతరులకు చేసింది సాయం కాదని, తనవంతు బాధ్యత అంటూ చెప్పుకొచ్చి యావత్ భారత ప్రజల దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు.

కాగా తాజాగా సోనూ సూద్ బాటలో వెళ్తున్నాడు టాలీవుడ్ కమెడియన్ కమ్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్. గతంలో సెవెన్ ఓ క్లాక్ బ్లేడ్‌తో గొంతు కోసుకుంటానంటూ ఛాలెంజ్ చేసి కామెడీ పండించిన బండ్ల గణేష్, గతకొద్ది రోజులుగా సైలెంట్ అయిపోయాడు. అయితే సోషల్ మీడియాలో సాయం కోసం ఎదురుచూస్తున్న వారికి తనవంతుగా సాయం చేస్తూ నెటిజన్ల మన్ననలు పొందుతున్నాడు. దీనికి సంబంధించి పలు పోస్టులు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

బాలీవుడ్‌కు సోనూ సూద్ ఉంటే టాలీవుడ్‌కు మా బండ్ల బాబు ఉన్నాడంటూ కొందరు ఆయన చేసిన సాయాన్ని గుర్తుకు చేసుకుంటున్నారు. ఏదేమైనా మంచి చేయాలనే ఆలోచన వచ్చినవారు ఎవరైనా ఇతరుల పట్ల వారు చూపించే బాధ్యత అభినందనీయమని పలువురు కామెంట్ చేస్తున్నారు. ఎవరికి ఎలాంటి సాయం కావాలన్నా తనను సంప్రందించాల్సిందిగా బండ్ల గణేష్ సోషల్ మీడియాలో కోరాడు. దీంతో అతడి పేరు సోషల్ మీడియా ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad