
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీని మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తోన్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన సింహా, లెజెండ్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్లుగా నిలిచాయి. అయితే వారిద్దరి కాంబినేషన్లో ఇప్పుడు మరో సినిమా వస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తగా చూస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్‌ను ఎప్పుడో మొదలుపెట్టిన చిత్ర యూనిట్‌కు కరోనా పెద్ద దెబ్బేసింది.
కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఈ క్రమంలో ఇటీవల సినిమా షూటింగ్‌లు మొదలవుతుండటంతో బాలయ్య చిత్రం ఎప్పుడ మొదలవుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కాగా ఇప్పట్లో బాలయ్య తన సినిమా షూటింగ్‌ను తిరిగి ప్రారంభిచడని చిత్ర వర్గాలు అంటున్నాయి. అయితే అందరికీ షాకిస్తూ, బాలయ్య ఇప్పుడు సినిమా షూటింగ్‌ను తిరిగి ప్రారంభించాలని చూస్తున్నాడు. స్టార్ హీరోలు ఇప్పటి వరకు ఎవరూ షూటింగ్లలో పాల్గొనడం లేదు.
కానీ బాలయ్య అందరినీ అవాక్కయ్యేలా చేస్తూ తన సినిమా షూటింగ్‌ను తిరిగి ప్రారంభించేందుకు రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్‌ను రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్లో నిర్వహించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. కాగా ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో నటిస్తుండగా, అందులో ఒకటి అఘోరా పాత్ర అని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన బాలీవుడ్ బ్యూటీ హీరోయిన్గా నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.