Home సినిమా గాసిప్స్ టాలీవుడ్ ‘టార్చ్ బేరర్’‌గా బాలయ్య..?

టాలీవుడ్ ‘టార్చ్ బేరర్’‌గా బాలయ్య..?

Balakrishna New Movie Titled Torch Bearer

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కోసం ఆయన అభిమానులు మాత్రమే కాకుండా యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక బాలయ్య నటిస్తున్న తాజా చిత్రాన్ని మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా కోసం నందమూరి అభిమానులు ఎంతో ఆశగా చూస్తున్నారు. ఈ సినిమాతో బాలయ్య ఎలాగైనా హిట్ కొట్టి తీరాలని చూస్తున్నాడు. కాగా పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తుండటంతో ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్‌ను ఇటీవల రిలీజ్ చేయగా, దానికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకు అంతే అదిరిపోయే టైటిల్‌ను పెట్టేందుకు బోయపాటి ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు మోనార్క్, సూపర్‌మ్యాన్, డేంజర్ వంటి పేర్లు వినిపించాయి. కానీ అవేవీ కూడా ఫిక్స్ కాలేదని చిత్ర యూనిట్ తెలిపింది. అయితే తాజాగా ఈ సినిమాకు మరో ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను పెట్టేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ సనిమాకు ‘టార్చ్ బేరర్’ అనే టైటిల్‌ను పెట్టాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

ఈ టైటిల్ అయితే సినిమాకు పర్ఫెక్ట్‌గా సరిపోతుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. గతంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘అరవింద సమేత’ చిత్రంలో ఈ ‘టార్చ్ బేరర్’ డైలాగ్ బాగా పాపులర్ అయ్యింది. దీంతో ఇప్పుడు బాలయ్య సినిమాకు అంత పాపులర్ డైలాగును టైటిల్‌గా పెడితే సినిమాకు బాగా కలిసొస్తుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. మరి ఈ సినిమాకు నిజంగానే టార్చ్ బేరర్ అనే టైటిల్‌ను పెడతారా లేక వేరే ఏదైనా టైటిల్ ఫిక్స్ చేస్తారా అనేది చూడాలి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad