Home సినిమా వివాదాల వర్మ .. మాకేంటి ఖర్మ : ఆడియన్స్

వివాదాల వర్మ .. మాకేంటి ఖర్మ : ఆడియన్స్

rgv 1

ప్రతిరోజు వివాదాలతో వార్తల్లో ఉండే వర్మ మరోసారి తనదైన వ్యంగ్యంతో ఇంటర్నెట్లో మరోసారి హల్ చల్ చేయడం మొదలుపెట్టారు. క్రితం పవర్ స్టార్ సినిమాతో చిచ్చు రేపిన ఈ వివాదాల వర్మ ఈసారి“మర్డర్” సినిమాతో వార్తల్లోకెక్కారు. దేశాన్ని కుదిపేసిన అమృత, మారుతి రావుల విషాదగాథ పై ‘మర్డర్’ పేరుతో సినిమా తెరకెక్కిస్తున్న విషయం ఇప్పటికే తెలిసిందే. ఈ సినిమాకు వర్మ శిష్యుడైనా ఆనంద్ చంద్ర దర్శకత్వం వహిస్తుండగా వర్మ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నాడు.

ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసి వివాదానికి తెర తీసిన వర్మ తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ”పిల్లల్ని ప్రేమించడం తప్పా…?” అనే పాట విడుదల చేసి సోషల్ మీడియాలో వివాదానికి ఆజ్యం పోశారు. చిన్ననాటి నుంచి అల్లారుముద్దుగా పెంచిన కూతురిని ప్రశ్నిస్తే తప్పా? తప్పు చేస్తే దండించడం తప్పా? అంటూ ఆలోచన కలిగించే పదాలతో కూడిన ఈ సాంగ్‌‌లో ప్రణయ్‌ని ముప్పుగా వర్ణించారు వర్మ. దీంతో ఈ సాంగ్ సామజిక మాధ్యమాల్లో ఈ పాట వైరల్ గా మారింది. ఇప్పటికే వర్మ పై విరుచుకు పడుతున్న నెటిజన్స్ ఈ పాటతో మరింత రెచ్చిపోతున్నారు. ఇవేమీ పట్టించుకోని రామ్ గోపాల్ వర్మ త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరో రెండు పాటల్ని విడుదల చేస్తామని ప్రకటించాడు.

మర్డర్ సినిమాను ఓటిటి వేదికల్లో కాకుండా నేరుగా థియేటర్లో విడుదల చేస్తామని ఇప్పటికే ప్రకటించిన వర్మ దీనికి సంబంధించి కూడా అఫీషియల్ అప్డేట్ ను విడుదల చేశాడు. ‘మర్డర్’ ఏకంగా 5 భాషలు (తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం)లో ఈ మూవీ విడుదల కానుండటం విశేషం. కాగా గతంలో ‘మర్డర్’ సినిమాపై ఘాటుగా రియాక్ట్ అవుతూ అమృత తీవ్ర భావోద్వేగానికి లోనైన సంగతి తెలిసిందే.విడుదలకు ముందే వివాదాల్లో రేపుతున్న ఈ సినిమా తర్వాత మరెన్ని వివాదాలకు కారణమవుతుందో చూడాలి మరి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad