Home టాప్ స్టోరీస్ అశ్వినీదత్ షాకింగ్ కామెంట్స్

అశ్వినీదత్ షాకింగ్ కామెంట్స్

Ashwini dutt 1280x720 1

థియేటరర్స్ అందుబాటులో లేకపోవడంతో చాలా సినిమాల్లో ఓటిటి వేదికల మీద విడుదలవుతు వస్తున్నాయి. అయితే  ఈ విషయంపై ఇండస్ట్రీలో బిన్నవాదనలు వినిపిస్తున్నాయి. నిర్మాతలు ఓటిటికి జై కొడుతుంటే నిర్మాతల మండలి మాత్రం దానికి వ్యతిరేకంగా స్వరాన్ని వినిపిస్తుంది. ముఖ్యంగా కోలీవుడ్ లో ఈ పరిస్థితి తారా స్థాయిలో ఉంది. అక్కడి నిర్మాతల మండలి ఓటిటి వ్యతిరేకంగా ప్రచారం చేస్తుంది. తాజాగా సుధా కొంగర దర్శకత్వంలో.. సూర్య నటించిన సూరారై పొట్రు సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై సింగం సినిమా దర్శకుడు హరి కొంచెం ఘాటుగా స్పందించాడు. కష్టపడి తీసిన సినిమాను ఓటిటిలో విడుదల చేయవద్దని, ఒకసారి సూర్య తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని సలహా ఇచ్చారు.

ఈ విషయం పై టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ వైజయంతీ మూవీస్ అధినేత అశ్వనీదత్ స్పందించారు. వచ్చే జనవరి వరకు థియేటర్లు తెరుచుకొనే పరిస్థితి లేదు. ఆ తర్వాత కూడా పరిస్థితి ఏ విధంగా ఉంటుందన్నది అంచనా వేయడం సంక్లిష్టంగా ఉంది. ఈ నేపథ్యంలో సినిమాలను కేవలం థియేటర్లోనే చూడాలి అనటం సరైన పద్ధతి కాదు. సినిమా కంటే ప్రేక్షకుల ఆరోగ్యం ప్రజల ప్రాణాలు అతి ముఖ్యమైనవి. అందులో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడకూడదు అని వారన్నారు.

అందుకనే సూర్య నటించిన ఆశాశం నీ హద్దురా సినిమాను దర్శక నిర్మాతలు ఓటిటిలో విడుదల చేస్తున్నారని తెలిపారు. నాని తన కెరీర్లో 25వ సినిమా అయినా “వి” ను ప్రేక్షకుల ఆరోగ్య  పరిస్థితుల దృష్ట్యా ఓటిటిలో విడుదల చేస్తున్నందుకు తానెంతో అభినందిస్తున్నానని అశ్వినీ దత్ అన్నారు.వినోదం కోరుకునేవాళ్లందరికీ సూర్య, నాని ఓ మార్గం చూపిస్తున్నారు. అలాగే డైరెక్టర్ హరి సినిమాలకు నేను అభిమానిని. ప్రేక్షకుల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని సూర్య తీసుకున్న నిర్ణయానికి మద్దతు తెలిపాల్సిందిగా ఆయనను కోరుతున్నాను అని అశ్వనీదత్ తెలిపారు

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad