Home సినిమా టాలీవుడ్ న్యూస్ ఎవరి ఊహలకు అందని పవన్ : చాలా విచిత్రం

ఎవరి ఊహలకు అందని పవన్ : చాలా విచిత్రం

Pawan Kalyan beard and side look image

మెగా ఫ్యామిలీలో చిరంజీవి తర్వాత ఆ స్థాయిని అందుకున్న ఏకైక నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రమే. మొదట చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ పరిచయం అయినప్పటికీ ఆ తర్వాత నుండి తన నటన, స్టైలిష్ యాక్టింగ్ తో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. అందుకే పవన్ కు ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. పవన్ నడవడిక చాలా వైవిధ్యంగా – విచిత్రంగా ఉంటుంది. ఎందుకంటే ? పవన్ ఆడియో మరియు అవార్డ్ ఫంక్షన్స్ కు  దూరంగా ఉంటాడు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సొంతింటి శుభకార్యాలకు కూడా పవన్ ఏప్పుడు దూరంగానే ఉంటూ వచ్చాడు.

తాజాగా మెగా బ్రదర్ నాగేంద్ర బాబు కుమార్తె నిహారిక నిశ్చయ వేడుక జరిగిన విషయం తెలిసిందే. ఇందులో మెగా కుటుంబ సభ్యులు అందరూ కనిపించినప్పటికీ పవన్ కళ్యాణ్ మాత్రం ఏ ఒక్క ప్రేమలో కూడా కనిపించలేదు. వాస్తవానికి పవన్ కళ్యాణ్ ను నాగేంద్ర బాబు ప్రత్యేకంగా అహ్వానించినప్పటికీ పవన్ నిశ్చితార్థ వేడుకకు హాజరు కాలేదు. అయితే వారం రోజుల కిందట నితిన్ పెళ్లి వేడుకకు పవన్ కళ్యాణ్ తన స్నేహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలిసి హాజరయ్యారు. పవన్ మొదటి నుండి కుటుంబ సభ్యులకు దూరంగానే ఉంటూ వచ్చారు.

దీనికి ప్రత్యేక కారణం ఏమిటో తెలియనప్పటికీ పవన్ కు అట్టహాసాలు-ఆడంబరాలు నచ్చవని అందుకే వాటికీ చాలా దూరంగా ఉంటారని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. పవర్ స్టార్ ఇప్పటివరకు చిరంజీవికి సంబంధించిన రెండు సినిమాల ఆడియో ఫంక్షన్లకు తప్ప మరి దేనికి హాజరు కాలేదు. కానీ తన అభిమానులు మరియు బయట వ్యక్తుల హీరోల ఆడియో ఫంక్షన్లకు మాత్రం తప్పక హాజరు అవుతాడు. పవన్ గురించి పూర్తిగా తెలిసిన అతని ఫ్యాన్స్ ఇదంతా సరా మామూలే అని అభిప్రాయ పడుతూ “వకీల్ సాబ్” టీజర్ కోసం ఎదురు చూస్తున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad