అనుష్క అనగానే అందరికి అరుంధతి గా గుర్తుకు వస్తుంది. లేడీ ఓరియెంటెడ్ మూవీలకి తనదైన శైలిలో ప్రేక్షకులను మెప్పించిన కథానాయిక ఈ భామ. సూపర్ సినిమాతో అరగేంట్రం చేసిన అనుష్క జోడిగా నాగార్జున పక్కన నటించింది. నాగార్జున సూపర్ సినిమా తీస్తున్న సమయంలో అనుష్కని ఎంతగానో ప్రోత్సహించారట. అందువల్లే నాగార్జున అంటే ప్రత్యేకమైన అభిమానాన్ని కనబరుస్తుంది అనుష్క. వీరిద్దరి కాంబినేషన్ లో చాలా సినిమాలు వచ్చాయి. డమరుకం, రగడ, డాన్… ఇలా చాలా సినిమాలలో కలిసి నటించారు. ఆ తరువాత లేడీ ఓరియెంటెడ్ చిత్రాలలో ఒక ఇమేజ్ సంపాదించుకుంది ఈ ముద్దు గుమ్మ. తాజాగా చాలా రోజుల గ్యాప్ తో నాగార్జునతో అనుష్క జోడి కట్టనుందని వార్తలు బయటకు వచ్చాయి.
నాగార్జున ‘మన్మథుడు’ సినిమా గతంలో భారీ విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలోనే మరో హిట్ కోసం ‘మన్మథుడు2’ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకరాబోతున్న విషయం అందరికీ తెలిసిందే. నాగార్జున ఈ సినిమా ను తన సొంత బ్యానర్లో నిర్మిస్తున్నాడు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించగా నాగార్జున సరసన హీరోయిన్ గా పాయల్ రాజ్ పుత్ నటిస్తుంది. మరో హీరోయిన్ గా అనుష్కను అనుకున్నారట. ఈ ప్రయత్నంలో ఫోటో షూట్ కూడా జరిగిందని కథనం. మార్చి రెండో వారము లో ‘మన్మథుడు 2’ను లాంచ్ చేస్తున్నారు.