Home సినిమా 'లిసా' త్రీడి ఎఫెక్ట్స్ తో దడ పుట్టిస్తున్నఅంజలి.. టీజర్ రిలీజ్..!

‘లిసా’ త్రీడి ఎఫెక్ట్స్ తో దడ పుట్టిస్తున్నఅంజలి.. టీజర్ రిలీజ్..!

హర్రర్ నేపథ్యంలో తెరకెక్కిన గీతాంజలి, చిత్రాంగథ లాంటి సినిమాలో నటించి ప్రేక్షకులను భయపెట్టింది అంజలి. అదేవిదంగా మరోసారి మనల్ని భయపెట్టడానికి ‘లిసా 3D ’ తో దయ్యం అవతారమెత్తింది. కానీ ఈ సారి రియల్ విజువల్ ఎఫెక్ట్స్ తో కొత్త ప్రయత్నముగా మనముందుకు రాబోతుంది. టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, బాలీవుడ్ లోను ఒకేసారి విడుదల చేయుటకు కసరత్తులు మొదలయ్యాయి. ఈ సినిమాకు సంబందించిన టీజర్‌ను ఇప్పటికే తమిళములో విడుదల చేశారు. తాజాగా తెలుగులో టీజర్‌ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.

‘పాపా.. పాపా కథ చెప్పనా.. కాకి, నక్క కథ చెప్పనా’? అనే డైలాగ్ తో మకరంద్ దేశ్ పాండే భయంకరమైన ఆకారం, వాయిస్ తో టీజర్ మొదలవుతుంది. ఒక ఫారెస్ట్ లో ఒక బూత్ బంగ్లా , అందులో దయ్యం చేస్తున్న విన్యాసాలు వచ్చేసరికి కుర్చీలు ఊగుతుండటం… కర్టెన్స్ కదులుతుండటం.. కరెంట్ పోవడం.. గాలి గట్టిగా వీస్తుండటం.. లాంటి సీన్స్  చూడవచ్చు. ఎన్నో సార్లు చాలా సినిమాలలో మనము చూస్తున్న సన్నివేశాలే తిరిగి ఇందులోనూ కనిపిస్తాయి. కంటెంట్ కొత్తగా ఏమి లేదు, త్రీడీ టెక్నాలజీ విసువల్ ఎఫెక్ట్స్ తో దయ్యాన్ని చూపిస్తూ థ్రిల్ చేయబోతున్నారు. టీజర్ లో అంతగా దడ పుట్టించలేదు కానీ, ప్రస్తుతం హర్రర్ సినిమాల కున్న క్రెజ్ వేరు అందులో త్రీడి ఎఫెక్ట్స్ తో రాబోతున్న చిత్రం కాబట్టి అంజలి దయ్యం ఎంతవరకు భయపెడుతుందో చూడాలి.

Lisaa 3D (Telugu) | Official Teaser | Anjali | Sam Jones |Brahmanandham |Raju Viswanath |PG Muthaiah

ఈ చిత్రానికి రాజు విశ్వనాథ్ రచన, దర్శకత్వం వహించాడు. లిసా తోనే దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు ఇండస్ట్రీకి . అంజలితో పాటు సామ్ జోన్స్, మకరంద్ దేశ్ పాండే, బ్రహ్మానందం, కళ్యాణి నటరాజన్, యోగి బాబు, సలీమా, మైమ్ గోపీ, సురేఖ వాణి తదితర నటీనటులు ప్రధానమైన పాత్రలలో నటిస్తున్నారు. అంజలి ప్రస్తుతానికి తమిళములో నాలుగు , తెలుగులో రెండు, మళయాలంలో ఒక సినిమాతో చాలా బిజీగా ఉంది. ఈ ఇయర్ అంతా అంజలి ఫుల్ బిజీ షెడ్యూల్ తో ఉంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad