గత ఏడాది సూపర్ డూపర్ హిట్ అయిన మూవీ రంగస్థలం. రామ్ చరణ్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ మూవీ టాలీవుడ్లో మూడవ అతి పెద్ద హిట్ సినిమాగా నిలిచింది. ఆ సినిమా హిట్ అయిన వెంటనే మహేష్ బాబు , సుకుమార్ కాంబినేషన్లో సినిమా అని ప్రకటన వచ్చింది.
రంగస్థలం విడుదలై ఇప్పటికి 11 నెలలు. అయినా ఇప్పటికీ సుకుమార్ సినిమా విడుదల కాలేదు. తాజా అప్డేట్ ప్రకారం వీరి కాంబోలో సినిమా ప్రారంభం కావడానికి మరో ఏడాది పట్టే అవకాశం ఉందట.సుకుమార్ తో సినిమాను మహేష్ బాబు, మే లేదా జూన్ నెలలో మొదలు పెడతాడని ఫిలింనగర్ వర్గాల టాక్. కానీ, ఆ సినిమా ప్రస్తుతం డౌట్లో పడిందట.
గత ఏడాదిన సుకుమార్ రజాకారుల బ్యాక్ డ్రాప్లో మహేష్ బాబు కు ఒక కథ చెప్పరట. కానీ, అది మహేష్ బాబు కు పెద్దగా నచ్చలేదు. దాంతో మరికొంత సమయం తీసుకున్న సుకుమార్ ఎర్రచందనం బ్యాక్ డ్రాప్లో మరో కథను మహేష్ బాబు కు చెప్పాడట.
సుకుమార్ చెప్పిన ఎర్రచందనం లైన్ నచ్చడంతో పక్కా స్క్రిప్ట్గా మలుచుకు రమ్మని మహేష్ బాబు చెప్పాడట. తాజాగా అందుకు సంబంధించిన పూర్తికథను విన్నాడు. సుకుమార్ చెప్పిన పూర్తి కథను విన్న మహేష్ బాబు చాలా డౌట్స్ అడిగాడట. దాంతో సుకుమార్ మరికొంత సమయం కావాలని అడిగినట్లు టాక్. ప్రస్తుతం మహర్షి సినిమాతో బిజీగా ఉన్న సూపర్ స్టార్ మార్చి నాటికి తన సినిమాను పూర్తి చేసుకుంటాడు.
మే తరువాత మరో సినిమాను పట్టాలెక్కించేందుకు మహేష్ బాబు ప్లాన్ చేసుకుంటున్నాడు. ఏప్రిల్ లో సుకుమార్ పూర్తి స్క్రిప్ట్ ను రెడీ చేసుకుని వస్తే మహేష్ బాబు మొదలుపెట్టే అవకాశం ఉంది. లేదంటే వేరే దర్శకుడితో కొత్త సినిమాను షురూ చేస్తాడట. రీసెంట్గా వెంకటేశ్ నటించిన ఎఫ్2ను తెరకెక్కించిన అనిల్ రావ్ పూడి ఇప్పటికే మహేష్ బాబు కు కొత్త కథను చెప్పాడు. అనిల్ రావ్ పూడి కూడా ఫుల్ స్క్రిప్ట్ చెప్పకపోవడంతో దాన్ని పూర్తి చేయమని మహేష్ బాబు చెప్పాడట. ఇలా ఈ ఇద్దరి దర్శకుల్లో ఎవరు ముందుగా స్క్రిప్ట్ రెడీ చేసుకు వస్తే వారి సినిమాను పట్టాలెక్కించేందుకు మహేష్ బాబు సిద్ధంగా ఉన్నాడట.