
తమిళ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుథ్ రవిచందర్ గురించి కేవలం తమిళనాటే కాకుండా తెలుగునాట కూడా అందరికీ తెలిసిందే. తనదైన మ్యూజిక్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా ఆయన అందించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచాయి. కాగా తన మ్యూజిక్‌తో తెరకెక్కిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్ కావడంతో అనిరుథ్‌కు అదిరిపోయే క్రేజ్ ఏర్పడింది. ఇక ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్‌తో తమ సినిమాలకు సంగీతం చేయించుకోవాలని పలువురు స్టార్ హీరోలు కూడా క్యూ కడుతున్నారు.
అయితే అనిరుథ్ రవిచందర్ కెరీర్లో ఎంత ఫేం వచ్చింది అంతే వివాదాలు కూడా వచ్చాయి. ఆయన హీరోయిన్లతో పబ్బులకు ఎక్కువగా తిరుగుతాడని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. గతంలో హీరోయిన్ ఆండ్రియా జెరెమియాతో కలిసి పబ్బులో ఘాటైన లిప్‌లాక్‌ల ఫోటోలు సోషల్ మీడియాలో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేశాయో అందరికీ తెలిసిందే. సుచీలీక్స్ పేరుతో తమిళ ఇండస్ట్రీలో ఈ ఫోటోలు తెగ హల్చల్ చేశాయి.
కాగా ఆ ఫోటోల గురించి ఇటు అనిరుథ్ గాని, ఆండ్రియా గాని ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే తాజాగా ఆండ్రియా అనిరుథ్‌తో తన ఫోటోల గురించి క్లారిటీ ఇచ్చింది. గతంలో ప్రేమలో ఉన్నప్పుడు అనిరుథ్‌ను ముద్దు పెట్టుకున్న వాస్తవమని, అయితే ముద్దుపెట్టుకోవడం తప్పు కాదని, కాన ఇలా ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టడం తప్పని ఆమె చెప్పుకొచ్చింది. ఏదేమైనా ఇలా తన పర్సనల్ విషయాలను పబ్లిక్ చేయడం మంచిది కాదని ఆమె చెప్పుకొచ్చింది. కాగా ఆండ్రియా చేసిన కామెంట్స్ ప్రస్తుతం కోలీవుడ్‌లో వైరల్‌గా మారాయి.