Home సినిమా యాంక‌ర్ ప్ర‌దీప్ పెళ్లి చేసుకోక‌పోవ‌డానికి అదే కార‌ణ‌మా....

యాంక‌ర్ ప్ర‌దీప్ పెళ్లి చేసుకోక‌పోవ‌డానికి అదే కార‌ణ‌మా….

pradeep thumb

తెలుగు టీవీ రంగంలో ఫీమేల్ యాంక‌ర్స్ జోరు ఎక్కువుగా ఉంటుంద‌నేది కాద‌న‌లేని స‌త్యం. సుమ‌, ఝాన్సీ, ఉద‌య‌భాను, మంజూష‌, శ్రీముఖి, శ్యామ‌ల లాంటి వాళ్లు దూసుకుపోతున్నారు. యాంక‌రింగ్ లో తామేమీ త‌క్కువ కాద‌ని నిరూపించుకుంటున్నారు మేల్ యాంక‌ర్స్. త‌మదైన శైలిలో ఆక‌ట్టుకుంటూ ప‌రుగులు పెడుతున్నారు. ర‌వి, సుడిగాలి సుధీర్, ప్ర‌దీప్ లాంటి యాంక‌ర్లు దుమ్ము దులిపేస్తున్నారు. వీరి అంద‌రిలో ప్ర‌దీప్ స్టైల్ చాలా స‌ప‌రేట్‌గా ఉంటుంది. చ‌క్క‌టి పద ప్ర‌యోగం, అంత‌కు మించిన స‌మ‌య‌స్పూర్తితో ముందుకెళ్తున్నాడు. ఈ క్ర‌మంలో ఎంతో మంది ఫిమేల్ ఫ్యాన్స్ ను సంపాదించుకున్నాడు. ఆడ‌వారే కాదు మ‌గ‌వారు కూడా ప్ర‌దీప్ యాంక‌రింగ్ స్టైల్ ను ఇష్ట‌ప‌డుతుంటారు. అచ్చూ మ‌న ఇంటి ప‌క్క‌న ఉన్న కుర్రాడు మాట్లాడిన‌ట్టుగానే వ్య‌వ‌హ‌రిస్తూ అంద‌రి ఆదారాభిమానాల‌ను చూర‌గొన్నారు.

టీవీ షోస్ తో అల‌రిస్తూనే సినిమాల్లో కూడా ఎంట్రీ ఇచ్చాడు. 30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా అనే సినిమాతో హీరోగా ప‌రిచ‌యం అవుతున్నాడు. ఈ సినిమాలో సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వ‌చ్చినా….. కొవిడ్ వ‌ల్ల సినిమా రిలీజ్ వాయిదా ప‌డింది. సినిమా రిలీయితే గానీ రిజ‌ల్ట్ తెలీదు. ఇంత‌లా రాణిస్తున్న ప్ర‌దీప్ ఇప్ప‌టికీ పెళ్లి జోలికి వెళ్ల‌లేదు. నిజానికి సంబంధాలు రాక‌కాదు. ప్ర‌దీప్ ఉ అనాలేకానీ వంద‌లాది మంది అమ్మాయిలు క్యూలో వ‌చ్చి లైన్ లో నిల‌బ‌డ‌తారు. మ‌నోడి క్రేజ్ ఆ రేంజ్ లో ఉంది. కానీ ప్ర‌‌దీప్ మాత్రం ఇప్ప‌ట్లో చేసుకోన‌ని చెప్పుకొస్తున్నాడు. అయితే దీనికి కార‌ణాలు కూడా లేక‌పోలేదు. వ‌రుస ఆఫ‌ర్స్ తో బిజీగా ఉంటున్న స‌మ‌యంలో ప్ర‌దీప్‌కు క‌నీసం నిద్ర పోవ‌డానికి కూడా స‌మ‌యం ఉండేది కాద‌ట‌. అందుకే ప్రేమ పెళ్లి అంటూ తిరగే ఛాన్స్ రాలేద‌ని ప్ర‌దీప్ చెబుతుంటాడు. ఇక ఇంట్లో వాళ్లు కూడా సంబంధాలు చూసి..చూసి ఇక విసుగుత్తిపోయార‌ట‌. మా వాల్ల కాదు రాబు బాబు అని అంటూ …..పెళ్లి నిర్ణ‌యాన్ని ప్ర‌‌దీప్ కి వ‌దిలేశార‌ట‌.

అయితే తాజాగా ప్ర‌దీప్ పెళ్లికి సంబంధించి ఒక ఆస‌క్తిక‌ర వార్త హ‌ల్ చ‌ల్ చేస్తోంది. అయితే యాంక‌ర్ కాక‌ముందు ఓ అమ్మాయి ప్రేమ‌లో ప‌డ్డాడ‌ట‌. అయితే ఆ అమ్మాయిని పోషించే స్థోమ‌త ఆ స‌మ‌యంలో లేక‌పోవ‌డం వ‌ల్ల దూరం అయ్యాడ‌ని టాక్. ఇప్పుడామె పెళ్లైపోయి భ‌ర్త‌తో , పిల్ల‌ల‌తో హాయిగా ఉంటోంద‌ట‌. ఆ అమ్మాయి ఇంకా మ‌న‌సులో ఉండ‌బ‌ట్టే….. ఎన్ని సంబంధాలు వ‌చ్చినా నో చెబుతూ వ‌స్తున్నాడ‌ని టాక్ . అందుకే చేసుకోవ‌డం లేద‌ని వాద‌న‌లు ఉన్నాయి. కొవిడ్ లాంటి స‌మయంలోనూ ప్ర‌దీప్ చాలా బిజీగా ఉన్నాడు. ఏదో ఒక షో చేస్తూనే ఉన్నాడు. ఇంత‌లోనే 35 ఏళ్లు కూడా వ‌చ్చేశాయి. ఇక ఇప్పుడు తాను పెళ్లికి రెడీ అంటున్నాడు మ‌న ప్ర‌దీప్. అయితే ఏ సంబంధం చూస్తారో ఏది ఒకే అవుతుందో చూడాలి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad