Home సినిమా గాసిప్స్ అనసూయ రెమ్యూనరేషన్ తెలిస్తే వావ్ అంటారు !

అనసూయ రెమ్యూనరేషన్ తెలిస్తే వావ్ అంటారు !

PicsArt 08 12 06.23.10

టాలీవుడ్ యాంకర్లలలో అనసూయ రూటే సపరేటు. మొదట న్యూస్ యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టిన ఈ అమ్మడు జబర్దస్త్ ద్వారా బుల్లి తెరపై రాకెట్లా దూసుకు వచ్చి అనతికాలంలోనే ప్రేక్షకుల మన్నన పొందింది. ఒక వైపు యాంకరింగ్ చేస్తూనే మరో వైపు సినిమాల్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఈ సమయంలో రంగస్థలం సినిమాలోని “రంగమ్మత్త” పాత్ర విపరీతమైన పేరు తీసుకురావడంతో పాటు ఆమెనస్థాయిని భారీగా పెంచింది.అప్పటి నుండి అటు బుల్లితెరపై ఇటు వెండితెర పై మరో వైపు మూవీ రిలీజ్ ఆడియో ఫంక్షన్స్ కు యాంకరింగ్ చేస్తూ భారీగా వెనకేసుకుంది. ఈ సమయంలో ఆమె చేసిన అనేక వివాదాస్పద వ్యాఖ్యలు టాలీవుడ్ హీట్ ను పెంచాయి. తాజాగా ఆమె ఇంటి పై ఐటీ అధికారులు రైడ్ చేశారు.

ఆమె ఆదాయం, ఇన్ కం టాక్స్ రిటర్న్స్ వంటి అంశాలు పై ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఆ తరుణంలో ఆమె సంపాదన ఎంత అన్న అంశం పై ఇండస్ట్రీలో జోరుగా చర్చ జరిగింది. సోషల్ మీడియాలో కూడా దీనిపై అనేక రూమర్స్ షేర్ అయ్యాయి. అయితే తాజాగా జబర్దస్త్ కామెడీ షో లో హైపర్ ఆది అనసూయ సీక్రెట్ బయట పెట్టాడు. స్కిట్ మధ్యలో “అనసూయ ఎపిసోడ్ కు మూడు లక్షలు రెమ్యూనరేషన్ తీసుకుంటుండగా, తాను 1 లక్ష రూపాయిలు” మాత్రమే తీసుకుంటానని చెప్పేశాడు. దీనికి ప్రకారం అనసూయ ప్రతి జబర్దస్త్ ఎపిసోడ్ గానూ మూడు లక్షలు తీసుకుంటున్న అన్నమాట. ప్రస్తుతం అనసూయ చేతిలో మూడు భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సుకుమార్-బన్నీ కాంబోలో వస్తోన్న ‘పుష్ప’, కృష్ణవంశీ ‘రంగమార్తాండ’, చిరంజీవి ‘ఆచార్య’లో అనసూయ నటిస్తున్నారు. దీనితోపాటు నితిన్ హీరోగా నటిస్తున్న ‘అందాదున్’ రీమేక్ లో కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఏదిఏమైనప్పటికీ టాలీవుడ్ లో అనసూయ జోరు యమ స్పీడులో ఉంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad