Home సినిమా ఎద‌పై టాటూ ర‌హ‌స్యం చెప్పిన అన‌సూయ‌..!

ఎద‌పై టాటూ ర‌హ‌స్యం చెప్పిన అన‌సూయ‌..!

యాంక‌ర్ అన‌సూయ, బుల్లితెర‌తోపాటు వెండితెర ప్రేక్ష‌కుల‌కు ఈ పేరు సుప‌రిచిత‌మే. అంతేకాకుండా, గ‌త సంవ‌త్స‌రం బాక్సాఫీసు వ‌ద్ద క‌న‌క‌వ‌ర్షం కురిపించిన రంగ‌స్థ‌లం చిత్రంలో న‌టించి త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపును తెచ్చుకుంది. ఆ చిత్రంలో అన‌సూయ న‌ట‌న‌కు సినీ విశ్లేష‌కులు సైతం ఫిదా అయి ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. ఇప్ప‌టికీ, ఎప్ప‌టికీ రంగ‌స్థ‌లం త‌న ఫేవ‌రేట్ సినిమా అని, అందులో రంగ‌మ్మ‌త్త క్యారెక్ట‌ర్‌ను ఎప్ప‌టికీ మ‌రిచిపోలేనంటూ అన‌సూయ ప‌లు మీడియా స‌మావేశాల్లో చెప్పిన సంగ‌తి తెలిసిందే.

ఇదిలా ఉండ‌గా, అన‌సూయ ఇటీవ‌ల ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో త‌న జీవితానికిసంబంధించిన ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను చెప్పుకొచ్చింది. త‌న‌కు ఇష్ట‌మైన ఫుడ్ బిర్యానీ అని, అంతేకాకుండా, త‌న‌కు యాంక‌రింగ్‌, న‌ట‌నే కాకుండా త‌న‌లో మంచి సింగ‌ర్ కూడా ఉంద‌ని తెలిపింది. తాను పెళ్లి చేసుకోక‌ముందు నుంచే త‌న‌కు తోడుగా మ‌రో ఆడ పిల్ల ఉంటే బాగుండ‌ని, త‌న‌కు పుడితే ఆడ పిల్లే పుట్టాల‌ని దేవుడ్ని కోరుకున్నాన‌ని, కానీ దేవుడు త‌న‌కు ఇద్ద‌రు అబ్బాయిల‌ను ఇచ్చాడ‌ని చెప్పింది.

మీరు ఫోటో షూట్ చేసిన ప్ర‌తీ సారి కుర్ర‌కారు మీ ఎద‌పై ఉన్న టాటూ గురించి అడుగుతుంటారు.. వారికి మీరిచ్చే స‌మాధానం ఏమిటి.?? అని అడిగిన యాంక‌ర్ ప్ర‌శ్న‌కు అన‌సూయ స్పందిస్తూ నా టాటూ అర్థం నిక్కు. అది నా భ‌ర్త ముద్దుపేరు అని స‌మాధానం ఇచ్చింది. దీంతో ఇన్నాళ్లపాటు అన‌సూయ టాటూకు అర్థం తెలీక జుట్టుపీక్కుంటున్న కుర్ర‌కారుకు కాస్త ఉప‌శ‌మ‌నం క‌లిగిన‌ట్టైంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad