
టాలీవుడ్ హాట్ యాంకర్ అనసూయ నిత్యం ఏదో ఒక వార్తతో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంటుంది. ఆమె బుల్లితెరపై హాట్ అందాలను ఆరబోస్తూ ‘జబర్దస్త్’ షోను ఓ రేంజ్‌కు తీసుకెళ్లింది. కాగా నెటిజన్లు ఆమెపై పలు విమర్శలు చేసినప్పుడల్లా వారికి క్లా్స్ పీకడం అనూకు అలవాటుగా మారింది. కాగా ఈ క్రమంలో తాజాగా తన అభిమానులతో ముచ్చటించిన ఈ బ్యూటీ, కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది.
తనకు వచ్చే జన్మలో ఎలా పుట్టాలని ఉంది అనే ప్రశ్నకు చాలా ఆసక్తికరమై జవాబునిచ్చింది. తనకు వచ్చే జన్మంటూ ఉంటే ఖచ్చితంగా ఏనుగులా పుట్టాలని కోరుకుంటోంది ఈ బ్యూటీ. ఏనుగుల గుంపులో ఆడ ఏనుగులకు ఎక్కువ గౌరవం దక్కుతుందని ఆమె తెలిపింది. ఏనుగుల జాతిలో జంట ఏనుగుల్లో ఒక ఏనుగు చనిపోతే మరో ఏనుగు నిద్రాహారాలు మానేసి అది కూడా చనిపోతుందని.. అలాగే వాటి కుటుంబానికి ఆడ ఏనుగులు ప్రాతినిధ్యం వహిస్తాయని అనసూయ తెలిపింది.
మనుష్యుల్లో ఆడవారిని నీచంగా చేసే పద్ధతి తక్కువయ్యే వరకు ఏనుగులే తనకు ఆదర్శంగా ఉంటాయని ఆమె పేర్కొంది. ఇక తనలాంటి ఫెమినిజం భావాలు ఉన్నవారు ఖచ్చితంగా మన సమాజాన్ని చూసి మనుష్యులకంటే జంతువులే నయం అని అంటారని అనసూయ ఈ సందర్భంగా తెలిపింది. ఏదేమైనా మరోసారి తనదైన కామెంట్స్‌తో అనసూయ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.