Home సినిమా టాలీవుడ్ న్యూస్ ఎంతో మంది యువ‌త‌కి ఆనంద్ ఆద‌ర్శ‌మ‌నే చెప్పాలి!

ఎంతో మంది యువ‌త‌కి ఆనంద్ ఆద‌ర్శ‌మ‌నే చెప్పాలి!

PicsArt 08 12 06.38.02

చిత్ర ప‌రిశ్ర‌మ అంటే రంగుల లోకం. ఆ రంగుల లోకంలో విహ‌రించాల‌ని ఎంతో మంది సొంతూరు వ‌దిలి పెట్టి హైద‌రాబాద్ వ‌చ్చేస్తుంటారు. ఏదైనా సినిమాలో క్యారెక్ట‌ర్ కోసం ప‌డిగాపులు కాస్తుంటారు. కృష్ణాన‌గ‌ర్ అడ్డాగా చేసుకుని రోజూ స్టూడియోల చుట్టూ తిరుగుతుంటారు. ఆఫ‌ర్లు దొరికేంత వ‌ర‌కు, లైఫ్ లో సెటిల్ అయ్యేంత వ‌ర‌కు…ఒక్కొక్క‌రిదీ ఒక్కో బాధ‌. అవి చెబుతుంటే ఇది నిజ‌మా అనిపించేలా ఉంటాయి. నేనింతే అనే సినిమాలో చూపెట్టాడు ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్. నిజానికి అంత‌కంటే ఘోర‌మైన ప‌రిస్థితులు ఉంటాయట‌. సినిమా ఛాన్సుల కోసం ఔత్సాహిక న‌టీన‌టులు పడే క‌ష్టాలు అన్నీ ఇన్నీ కావ‌ట‌. ఎన్టీఆర్ , ఏఎన్ ఆర్‌, చిరంజీవి నుంచి నేటి రాజ్‌త‌రుణ్ వ‌ర‌కు అంద‌రూ క‌ష్టాలు ప‌డ్డ‌వాళ్లే. అలా పైకొచ్చిన‌వాళ్లే. ఇక టీవీ ప‌రిశ్ర‌మ కూడా అంతే. పెద్ద తెర మిస్ అయిన‌వాళ్లు క‌నీసం చిన్న‌తెర‌లోనైనా నిరూపించుకోవాలని తాప‌త్ర‌య ప‌డుతుంటారు. ఈ క్ర‌మంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. అలాంటి ప‌రిస్థితుల్లో కొన్ని కామెడీ రియాల్టి షోస్ చాలా మందికి లైఫ్ నిచ్చాయి.

అలాంటి షోస్ లో ఒక‌టి జ‌బ‌ర్ద‌స్త్‌. ఈ షో ఇండ‌స్ట్రీలో ఎంతోమందిని ఆదుకుంది. ఈ షో వల్ల వెండితెరకు, బుల్లితెరకు ఎంతమంది కమెడియన్స్ పరిచయమయ్యారు. అందులో ఒకరు ఆనంద్‌. చ‌మ్మ‌క్క చంద్ర టీమ్‌లో బాగా క‌న‌ప‌డేవాడు. ఇప్పుడు టీమ్ లీడ‌ర్ స్థాయికి ఎదిగాడు. ఇత‌ను కూడా చాలా క‌ష్టాలే ప‌డ్డాడ‌ట‌. జబర్దస్త్ లోకి రాకముందు వచ్చిన తరువాత తను ఎదుర్కొన్న ఒడిదుడుకులు గురించి…. ఓ ఇంట‌ర్వ్యూలో ప్రేక్ష‌కుల‌తో పంచుకున్నారు. జబర్దస్త్ లోకి రాకముందు సినిమా ఛాన్సులు కోసం…. ఆనంద్ తిరిగిన తిరుగుళ్లు అన్నీ ఇన్నీ కావు. అయినా దొరికేవి కావు. ఎవ‌రూ ఆదుకునేవాళ్లు లేరు. ఎవ‌రినైనా చేయి చాచి అడుక్కుందాము అంటే….. ఆత్మాభిమానం అడ్డు వ‌స్తుంది. దీంతో వేరే దారిలేక గుడిలో పెట్టే ప్ర‌సాదంతో ఒక పూట‌కు ఆహారం అయ్యింది. మిగతా పూటలు తినేవాడు కాదు. రాత్రుల్లో ఆఖ‌లితోనే ప‌డుకునేవాడు. దిల్‌సుఖ్‌నగర్ బస్టాండ్‌లో బిచ్చగాళ్ల పక్కన నిద్రించేవాడు. ఇప్ప‌టికి క‌ష్టాల నుంచి బ‌య‌ట‌ప‌డ్డాడు. అర్ధాక‌లి రోజులు లేవు. జ‌బ‌ర్ద‌స్త్ లో టీమ్ లీడ‌ర్‌స్థాయికి ఎదిగాడు.

మంచి సంపాద‌న వ‌స్తుండ‌టంతో…హ్యాపీ గాయ్ అయ్యాడు. వ‌చ్చిన అవ‌కాశాన్ని బాగా ఉప‌యోగించుకుని…న‌చ్చిన కెరీర్‌లో విజ‌యం సాధించ‌గ‌లిగాడు. తోటి వారి కంటే బాగా చేయాల‌నే క‌సి త‌న‌ను ఇక్క‌డి వ‌ర‌కు తీసుకొచ్చింద‌ని అంటున్నాడు ఆనంద్‌. సినిమాల్లో కూడా అవ‌కాశాలు వ‌స్తున్నాయ‌ని సంతోష‌ప‌డుతున్నాడు. సినిమా, టీవీ రంగాల్లో వెలిగిపోవాల‌నుకుంటున్న ఎంతో మంది యువ‌త‌కి ఆనంద్ ఆద‌ర్శ‌మ‌నే చెప్పాలి. అంటే త‌న‌లా క‌ష్టాలు ప‌డాలి అని కాదు. న‌ట‌న ప‌ట్ల ఆస‌క్తితో అవ‌కాశాల కోసం ప్రయ‌త్నిస్తే ఎప్ప‌టికైనా ఫ‌లితం ద‌క్కుతుంద‌ని నిరూపించాడు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad